Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన : బాధితుడి పాదాలు కడిగి క్షమాపణలు చెప్పిన సీఎం శివరాజ్

Advertiesment
feet wash
, గురువారం, 6 జులై 2023 (13:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో ఓ ఆదివాసీ కూలీపై బీజేపీ ప్రతినిధి ప్రర్వేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన ఘటన ఇపుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. త్వరలోనే ఎన్నికలు జరుగనుండటంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేశారు. అలాగే, ఆయన ఇంటిని కూడా కూల్చివేశారు. ఈ నేపథ్యంలో బాధిత ఆదివాసీకి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా క్షమాపణలు చెప్పారు.
 
గురువారం బాధితుడిని భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించిన సీఎం చౌహాన్.. స్వయంగా అతడి కాళ్లు కడిగారు. ఆ తర్వాత అతడిని పరామర్శించారు. ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ఘటనకు సంబంధించిన వీడియో తనను ఎంతగానో బాధించిందన్నారు. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నా. ప్రజలే నాకు దేవుడితో సమానం అని చెప్పారు. ఈ తరహా దుశ్చర్యలను సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవం తన గౌరవమేనని చెప్పారు. 
 
మూత్ర విసర్జన చేసిన నిందితుడి ఇల్లు కూల్చివేత  
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతినిధిగా చెప్పుకునే పర్వేశ్ శుక్లాకు ఆ రాష్ట్ర అధికారులు తీవ్రమైన శిక్ష విధించారు. ఏకంగా అతని ఇంటిని కూల్చివేశారు. తమ ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని చూసిన అతని కుటుంబ సభ్యులు హతాశులైపోయారు. తమ కుమారుడిపై కుట్ర పన్నారంటూ నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా, ఎపుడో జరిగిన పాత వీడియోను ఉద్దేశ్యపూర్వకంగా బయటకు తీశారని పేర్కొంటున్నారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో ఇటీవల గిరిజన కార్మికుడిపై పర్వేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నీచపనికి పాల్పడిన పర్వేజ్ శుక్లాను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. 
 
తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అతడి ఇంటిని కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. ప్రస్తుతం పర్వేజ్ శుక్లా రేవా కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఆదేశాలతో ఆయనపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. పైగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హోం శాఖ స్పష్టం చేసింది.
 
ఇదిలావుంటే పర్వేశ్ శుక్లా ఇంటిని కూల్చివేయడాన్ని చూసిన ఆయన కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి నేరానికి సాక్ష్యంగా పోలీసులు ప్రస్తావిస్తున్న వీడియో చాలా పాతదని చెప్పారు. ఎన్నికలు సమీపించడంతో రాజకీయ కారణాలతో దీన్ని వెలుగులోకి తెచ్చారని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య ... ఎక్కడ?