Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వానాకాలంలో తీసుకోవలసిన ఇంటి జాగ్రత్తలు

Advertiesment
వానాకాలంలో తీసుకోవలసిన ఇంటి జాగ్రత్తలు
, శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:23 IST)
ఈ సీజన్‌లో వానలకు ఇంటి గోడలు, ఫర్నీచర్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. అంతేకాదు టెర్రస్ మీద నాచు, ఫంగస్ పెరిగే అవకాశమెక్కువ. కిచెన్‌లో కూరగాయలు తొందరగా పాడవుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివాటిని అధిగమించవచ్చు.
 
ఈ సీజన్‌లో టెర్రస్ మీద నీళ్లు నిలవడంతో పాటు రూఫ్ నుంచి నీళ్లు కారుతుంటాయి. వాటర్‌ఫ్రూఫ్ పెయింట్ వేస్తే నీళ్లు కారడం తగ్గిపోతుంది.
 
ఈ కాలంలో తేమ ఎక్కువ. దాంతో లోహంతో తయారుచేసిన తలుపులు, కిటికీలు తుప్పు పడతాయి. కాబట్టి వాటిని మెటల్ పెయింట్ సెకండ్ కోటింగ్ ఇస్తే సరి.
 
తక్కువ బరువు, ప్రకాశమంతమైన రంగుల పరదాలు చల్లటి, మబ్బుపట్టిన వాతావరణానికి సరిపోతాయి.
 
తేమకు చెక్కతో చేసిన ఫర్నీచర్ తొందరగా పాడవుతుంది. అందుకే తేమను తక్కువగా పీల్చుకునే వెదురు, పేము ఫర్నీచర్ ఎంచుకోవాలి.
 
ఈ కాలంలో కూరగాయలు తొందరగా కుళ్లిపోతాయి. కాబట్టి వాటిని కాగితంలో చుట్టి, ఫ్రిజ్‌లో ఉంచాలి. మసాలా దినుసులను వేగించి, బిగుతైన డబ్బాలో ఉంచితే వాటి ఘాటు, వాసన అలానే ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకలిని కాస్త చంపుకుని.. తేలికపాటి ఉపవాసాలతో ఒబిసిటీ తగ్గించుకోవచ్చు...