Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బా... విపరీతంగా గొంతునొప్పి, ఎందుకని?

Advertiesment
అబ్బా... విపరీతంగా గొంతునొప్పి, ఎందుకని?
, శనివారం, 31 జులై 2021 (12:55 IST)
స్వరపేటిక వాపు వచ్చినప్పుడు గొంతుబొంగురు, మాట సరిగ్గా రాకపోవడం, గొంతు మింగుడు పడకపోవడం, గొంతు నొప్పి, గొంతు పెగలకపోవడం వంటి సమస్యలు వస్తాయి. స్వరపేటిక వాపు తాత్కాలికం, దీర్ఘకాలికం అని రెండు రకాలు. తాత్కాలిక సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటే దీర్ఘకాలిక సమస్య వారాలు, నెలలు తరబడి ఉంటుంది.
 
జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, మింగుతుంటే నొప్పి, దగ్గేటప్పుడు కళ్లె రావటం, చెవినొప్పి, పంటినొప్పి కూడా ఉండవచ్చు. గాలి సరిగ్గా ఆడకపోవడం, కంటినుంచి, ముక్కునుంచి నీరు కారటం వంటి లక్షణాలు కొన్నిరోజుల్లో తగ్గినా మళ్లీ తిరగబెట్టి దీర్ఘకాలికంగా మారువచ్చు. సాధారణంగా ఎక్కువగా మాట్లాడేవారికి అంటే టీచర్లు, ప్రొఫెసర్లు, గాయకులు, నాయకులు, వ్యాపారస్థులకు దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశముంది.
 
ఈ గొంతునొప్పికి కారణాలు ఏమిటని చూస్తే... న్యూమోనియా వైరస్, స్ట్రెప్టోకోకల్, స్టెఫలోకాకల్, ఇతర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఆసిడ్ రిఫ్లక్స్ డిసీజ్, దగ్గటం, పొగతాగడం, ఆల్కహాల్ లేదా మత్తుపానీయాల వాడకం, అలర్జీస్, కార్టికో స్టెరాయిడ్స్, ఆస్తమాకు వాడే మందులు.
 
లక్షణాలు ఎలా వుంటాయంటే.. గొంతు బొంగురు పోవడం, గొంతుభాగంలో గుచ్చుకున్నట్లు ఉండటం, గొంతును తరచు సరిచేసుకోవాల్సి రావడం, జ్వరం, దగ్గు, గొంతుభాగంలో వాపు, దగ్గుతోపాటు ఆకుపచ్చరంగులో కఫం పడటం, రక్తంతో కూడిన కళ్లె, ద్రవపదార్థాలు మింగడంలో నొప్పి, శ్వాస పీల్చడంలో ఇబ్బందులతోపాటు పిల్లల్లో  అయితే మితిమీరిన కోపం, పక్కవారిని కొరకడం, కొట్టడం, వస్తువులను విసిరివేయడం పారిపోవాలనిపించడం, వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
 
గొంతు, ముక్కు, నోరు, చెవి భాగంలో సమస్యలు, మెడ, ఛాతి ఎక్స్‌రే, లారింజియో స్కోపీ ద్వారా పరీక్ష, సీబీఐ, ఇఎస్ఆర్, థ్రోట్ స్వాబ్ కల్చర్ పరీక్షల ద్వారా ఎందుకు, ఏ మేరకు స్వరపేటిక వాచిందో తెలుసుకోవచ్చు. దీనికి హోమియో చికిత్స ఏంటంటే... బెల్లడోనా, ఎంఐఆర్, ఫైటోలక్కా, లాకెసిస్, మెర్క్‌సాల్, ఫాస్పరస్, రూమెక్స్, స్పాంజియా, డ్రోసెరా వంటి మందులను వ్యాధిలక్షణాలను బట్టి వైద్యుని పర్యవేక్షణలో వాడటం ద్వారా ఆయా బాధలకు తాత్కాలిక ఉపశమనంతోబాటు శాశ్వత పరిష్కారం కూడా లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరణించువారి లక్షణములు ముందుగా తెలుసుకోవడం ఎలా?