Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ దోషం వుంటే పెళ్లి కాదా? దోష నివారణకు మార్గమేంటి?

ఈ దోషం వుంటే పెళ్లి కాదా? దోష నివారణకు మార్గమేంటి?
, మంగళవారం, 20 జులై 2021 (18:45 IST)
పెళ్లి కావలసిన వారికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకు గాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే మంగళచండీ దేవిని పూజించాలని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది.
 
కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. మంగళుడే కాదు, సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి. కుటుంబ సంక్షేమం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 
 
త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవారు పరమేశ్వరుడు. రెండవ వాడు అంగారకుడు, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతి తొలగిపోతుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజా విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.
 
మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని విశ్వాసం.
 
శత్రు పీడలు, రుణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచి ఫలితాలను పొందవచ్చునని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నో టిక్కెట్స్, రిలీజ్ చేసిన కాసేపటికే శ్రీవారి టిక్కెట్లు హాంఫట్