Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

Advertiesment
Home Remedies for Sciatica Pain
సయాటికా(Sciatica) అనేది వెన్నెముక కింది భాగం నుండి మొదలై కాలి చివరి వరకు పాకే నొప్పి. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ, ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు మరియు వ్యాయామాల ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. సయాటికా నొప్పి తగ్గడానికి పాటించవలసిన ముఖ్యమైన చిట్కాలు ఏమిటో చూద్దాము.
 
వేడి, చల్లని ప్యాక్స్, ఇది తక్షణ ఉపశమనానికి బాగా పనిచేస్తుంది. నొప్పి మొదలైన మొదటి 2-3 రోజులు ఐస్ ప్యాక్ వాడండి. ఇది వాపును, మంటను తగ్గిస్తుంది. నొప్పి వచ్చిన చోట వేడి నీళ్ల బ్యాగుతో కాపడం పెట్టండి. ఇది రక్త ప్రసరణను పెంచి, కండరాల బిగువును తగ్గిస్తుంది. ఒకటి వదిలి ఒకటి (అంటే 15 నిమిషాలు చల్లనిది, తర్వాత 15 నిమిషాలు వేడిది) చేయడం వల్ల మరింత వేగంగా ఫలితం ఉంటుంది.
 
పడుకునే పద్ధతి మార్చుకోండి. నొప్పిగా ఉన్నప్పుడు నిద్రపోయే భంగిమ వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒక్క పక్కకు పడుకునేవాళ్లు మోకాళ్ల మధ్యలో ఒక మెత్తని దిండును ఉంచుకోండి. ఇది వెన్నెముకను సరైన స్థితిలో ఉంచుతుంది. వెల్లకిలా పడుకుంటే, మోకాళ్ల కింద దిండును ఉంచుకోండి. దీనివల్ల నడుము కింద భాగంలో ఒత్తిడి తగ్గుతుంది.
 
తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి. నొప్పి ఉంది కదా అని పూర్తిగా పడుకోకూడదు. కదలికలు లేకపోతే నొప్పి పెరుగుతుంది. భుజంగాసనం వేస్తే ఇది వెన్నెముకకు బలాన్ని ఇస్తుంది. అలాగే మోకాళ్లను ఛాతీ వరకు లాగండి. వెల్లకిలా పడుకుని మోకాళ్లను నెమ్మదిగా మోకాళ్లను ఛాతీ వైపుకు లాగి పట్టుకోవడం వల్ల కింది వెన్ను కండరాలు రిలాక్స్ అవుతాయి. రోజూ 10-15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల నరాలు ఉత్తేజితం అవుతాయి.
 
ఆహారంలో మార్పులు చేసుకోవాలి. లోపలి నుంచి మంటను (Inflammation) తగ్గించే ఆహారం తీసుకోండి. పసుపులో ఉండే 'కర్కుమిన్' సహజమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగండి. అల్లం కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం (అరటిపండ్లు, బాదం, ఆకుకూరలు) కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
 
మసాజ్... వేడి చేసిన నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో చాలా సున్నితంగా మసాజ్ చేయండి. గట్టిగా నొక్కకూడదు, కేవలం నూనె చర్మంలోకి ఇంకేలా రుద్దాలి. 
 
ఎప్పుడు జాగ్రత్త పడాలి?
కాలిలో స్పర్శ కోల్పోవడం లేదా మొద్దుబారిపోవడం.
కాళ్లు విపరీతంగా బలహీనపడటం.
మూత్ర విసర్జన లేదా మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం (ఇది అత్యవసర పరిస్థితి).
నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉండటం వంటివి వుంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.
 
మీరు కూర్చునే కుర్చీకి వెనకాల నడుము సపోర్ట్ (Lumbar support) ఉండేలా చూసుకోండి మరియు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా ప్రతి గంటకు ఒకసారి లేచి అటు ఇటు నడవండి. ఇవి కేవలం ఇంటిచిట్కాలు మాత్రమే. సమస్య తీవ్రంగా వుంటే వైద్యుడిని సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం