Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధిక బరువు తగ్గాలంటే.. ఇలా చేయాల్సిందే..?

అధిక బరువు తగ్గాలంటే.. ఇలా చేయాల్సిందే..?
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (14:14 IST)
సాధారణంగా భారతీయులు ఎక్కువగా కారం తింటారు. ముఖ్యంగా చెప్పాలంటే.. హిందువులే కూరల్లో కారం ఎక్కువగా వేస్తారు. కొందరేమో పచ్చిమిరపకాయ వేస్తారు.. మరికొందరేమో ఎండుకారం వేస్తుంటారు. ఏదేమైనా భోజనం మాత్రం కారం లేకుండా తినలేం. కానీ కొందరు మాత్రం కారం తినేందుకు విముఖత ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.. వారు కూడా ఇకపై కారం అంటే ఇష్టంగానే తింటారు. 
 
అల్సర్ల వ్యాధితో బాధపడేవారు కారం ఎక్కువగా తినకూడదని చెప్తుంటారు. కానీ సైంటిస్టులు ఇటీవలే చేసిన ఓ పరిశోధన ప్రకారం.. కారంలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణ సంబంధిత వ్యాధులను పోగొడతాయని వెల్లడించారు. కారం తినడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. 
 
చాలామంది తరచు అధిక బరువు తగ్గించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు మాత్రం కాస్త కూడా తగ్గలేదని సతమతమవుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. అప్పుడప్పుడు మిరపకాయలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తింటుంటే.. ఫలితం ఉంటుంది. ఎందుకంటే.. మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనే ఆమ్లం అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా శరీర వాపులను తగ్గిస్తుంది.
 
క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టే గుణాలు మిరపకాయలో అధిక మోతాదులోనే ఉన్నాయి. గర్భిణులు తరచు వాంతులతో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో మిరపతో చేసిన పచ్చడో లేదో కూర తింటే సరిపోతుంది. మిరపలోని న్యూట్రియన్ ఫ్యాట్స్ అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. అందుకు అదేపనిగా మాత్రం కారం తినకూడదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే వ్యక్తి...?