ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ డోనర్ కన్నుమూశారు. ఈయన సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను తెరకెక్కించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఈ సోమవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన 1960 టీవీల్లో "ట్విన్ లైట్ జోన్" అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
1970 మధ్యలో ఈయనకు హాలీవుడ్‌లో తగిన గుర్తింపు లభించింది. 1978లో క్రిష్టోఫర్ రీవేతో తెరకెక్కిన సూపర్ మ్యాన్ ఈయనకు ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో ఆ తర్వాత పలు చిత్రాలు తెరకెక్కాయి. తెలుగుతో పాటు హిందీలో సూపర్ మ్యాన్ స్టోరీతో పలు చిత్రాలు అదే టైటిల్‌తో తెరకెక్కాయి.
1985లో ఈయన డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన గూనీస్ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. కొంత మంది పిల్లలు ఎక్కడో ఉన్న గుప్త నిధులను ఎలా కనుగొన్నారనేది ఈ స్టోరీ. హాలీవుడ్‌లో ఈ అడ్వెంచర్ డ్రామాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ప్రపంచ సినిమా చరిత్రలో గూనీస్ కల్డ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. సూపర్ మ్యాన్ కంటే ముందు ఈయన 1976లో ఫ్రీ విల్లీ అండ్ లాస్ట్ బాయ్స్ ఈయనకు దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.
స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా ఈయన తెరకెక్కించిన గూనీస్ సినిమా ఇన్‌స్ప్రేషన్‌తో పలు చిత్రాలను తెరకెక్కించినట్టు పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాదు ఎంతో హాలీవుడ్ దర్శకులకు ఈయన సినిమాలు ఓ నిఘంటువులా పనిచేసాయని కితాబు ఇచ్చారు. ఈయన మృతిపై పలువురు హాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.