ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబీ కోల్ట్రేన్ తుదిశ్వాస విడిచారు. మరణించేనాటికి ఆయనకు 72 సంవత్సరాలు. స్కాట్లాండ్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. కారణాలేంటో తెలియదు కాదు ఈయన మృతిపై పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ల్రేన్ సుపరిచితుడే. అలాగే జేబ్స్ బాండ్ సిరీస్‌లోని రెండు సినిమాల్లో నటించాడు.
థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రాబీ కోల్ల్రేన్ ఫ్లాష్ గార్డాన్ సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. హ్యారీ పోటర్ సిరీస్‌కు ముందు రాబీ కోల్ట్రేన్.. 1990లో వచ్చిన టీవీ సిరీస్ క్రాకర్‌లో హార్డ్-బీటెన్ డిటెక్టీవ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాబీ వరుసగా మూడు సార్లు ఉత్తమ నటుడిగా BAFTA TV అవార్డులు గెలుచుకున్నాడు.