Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?

100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?
, ఆదివారం, 11 నవంబరు 2018 (15:16 IST)
వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినపుడు ఆయన గాయపడిన గాయాలకు గాంధారి సేవచేసి, ఆయనకు కావలసిన సపర్యలన్నీ చేసింది. ఇందుకు ఆయన సంతోషించి నీకు ఎలాంటి కోరిక ఉన్నా.. దానిని తీరుస్తాని ఆమెకు ప్రమాణం చేశాడు. గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరగా, మహర్షి అలాగే నీకు వంద మంది కొడుకులు పుడతారని అభయమిస్తాడు. అలా, గాంధారికి వంద మంది పుత్రులు కలుగుతారు. వీరినే కౌరవులుగా మహాభారతంలో పేర్కొంటారు. ఈ వంద మంది పేర్లు చాలా మందికి తెలియవు. ఇపుడు తెలుసుకుందాం. 
 
1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు. 
 
51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54. బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-11-2018 ఆదివారం దినఫలాలు - బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం...