Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణుడు, భానుమతి ఏకాంతంలో... దుర్యోధనుడు ఏం చేశాడంటే?

పాండవులపై అసూయ ద్వేషాలతో రగిలిపోతూ నిరంతరం వారి పతనాన్ని కోరుకుని చివరికి కురువంశ వినాశనానికి కారణమయిన దుర్యోధనుడి గురించి మనకు తెలిసిందే. కానీ కర్ణ దుర్యోధనుల స్నేహం గురించి మనం మరికొంత తెలుసుకోవాల్సి ఉంది. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు నెగ్గగా, దుర్

Advertiesment
Mahabharata
, బుధవారం, 22 ఆగస్టు 2018 (21:28 IST)
పాండవులపై అసూయ ద్వేషాలతో రగిలిపోతూ నిరంతరం వారి పతనాన్ని కోరుకుని చివరికి కురువంశ వినాశనానికి కారణమయిన దుర్యోధనుడి గురించి మనకు తెలిసిందే. కానీ కర్ణ దుర్యోధనుల స్నేహం గురించి మనం మరికొంత తెలుసుకోవాల్సి ఉంది. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు నెగ్గగా, దుర్యోధనుడు ఓడిపోతాడు. దానితో దుర్యోధనుడు జీర్ణించుకోలేక చింతిస్తుండగా, కాశీ రాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని శకుని చెబుతాడు. దానితో దుర్యోధనుడికి కొత్త ఉత్సాహం వస్తుంది. తన మిత్రుడైన కర్ణుడితో కలిసి స్వయంవరానికి వెళతాడు.
 
అక్కడ స్వయంవరంలో పాల్గొనడానికి వారితోపాటు శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహావీరులు వస్తారు. కొద్దిసేపటికి స్వయంవరం ప్రారంభమవగా, రాజకుమారులను చూస్తూ భానుమతి ముందుకు సాగుతుంది, అక్కడ ఆమె కళ్లు కర్ణునిపై పడతాయి. అతనినే వివాహమాడాలని నిర్ణయించుకుంటుంది. దుర్యోధనుడిని చూసీచూడనట్లుగా వదిలేస్తుంది. ఆ కృత్యంతో దుర్యోధనుడి అహంభావం దెబ్బతింటుంది. తిరస్కారాన్ని భరించలేని దుర్యోధనుడు ఆమెను అమాంతంగా ఎత్తుకుని హస్తినకి బయల్దేరుతాడు. అడ్డు వచ్చిన రాకుమారులను వారించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. దుర్యోధనుడు హస్తినలో భానుమతిని వివాహమాడతాడు.
 
ఒకనాడు కర్ణుడు, దుర్యోధ‌నుడి భార్య భానుమ‌తి ఆమె మందిరంలో పాచిక‌లు ఆడుతూ ఉంటారు. ఆట చాలాసేపు కొనసాగి ముగింపు దశలో భానుమతి ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంతలో దుర్యోధనుడు అక్కడికి రాగా, భానుమతి ద్వారానికి ఎదురుగా ఉన్నందున అది గమనిస్తుంది. కర్ణుడి వీపు ద్వారం వైపు ఉంటుంది. దుర్యోధనుడిని చూసి భానుమతి మర్యాదగా లేవడంతో, ఓటమి కారణంగా వెళ్లిపోతోందని అర్థం చేసుకున్న కర్ణుడు, ఆమె ముఖంపై ఉన్న వస్త్రాన్ని లాగి ఆపడానికి ప్రయత్నిస్తాడు. 
 
ఆ వస్త్రానికి అలంకరించి ఉన్న ముత్యాలు తాడు తెగి కిందపడతాయి. కంగారుగా ఉన్న భానుమతి ముఖం చూసి వెనక్కి తిరిగి చూడగా దుర్యోధనుడు కనిపిస్తాడు. వారిద్దరికీ ఏమి చేయాలో తోచక తలలు దించుకుంటారు. కానీ దుర్యోధనుడు తాపిగా వచ్చి ముత్యాలు ఏరాలా లేక ఏరి దండ గుచ్చాలా అని చమత్కరిస్తాడు. కర్ణునిపై దుర్యోధనుడికి ఉన్న నమ్మకం అదీ. కర్ణ దుర్యోధనుల స్నేహం ఎంత బలమైందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మీ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో చేయొచ్చా?