Publish Date: Tue, 31 Dec 2019 (21:35 IST)
Updated Date: Tue, 31 Dec 2019 (21:37 IST)
చింతచిగురు పప్పుతో కూర చేసుకుని అన్నంలో కలుపుకుని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మనకు తృప్తి కలుగుతుంది. చింతచిగురు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.
చింతచిగురు పప్పులో వాడడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బెణుకులకు, పాత నొప్పులకు చింత చిగురు దివ్యౌషధంలా పనిచేస్తుందట. చింతచిగురును బెల్లంతో నూరి నొప్పులున్న చోట పట్టువేసినట్లయితే నొప్పులు తగ్గిపోతాయట. రక్తహీనత సమయంలో చింతచిగురు వంటలు ఇంగ్లీష్ మందుల్లా పనిచేస్తాయట. చింతచిగురు కూర కీళ్ళ నొప్పుల నివారణకు ఎంతగానో పనిచేస్తుందట.
చింతచిగురును కొబ్బరిపాలలో కలిపి బాగా నూరి దానిలో పసుపు, పచ్చ, కర్పూరాన్ని కలుపుకుని పేస్ట్‌గా మారేవరకూ కలిపి, ఆ పేస్టును ఓ ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకుని ముఖంపైన మొటిమలు గాని, మచ్చలు గానీ ఉన్నట్లయితే ఆ పేస్టును ముఖానికి పూసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలట.
ఇలా చేస్తే ముఖం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుందట. ఇలా పది, పదిహేనురోజులు చేసినట్లయితే ముఖంపై మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయట.
సిహెచ్
Publish Date: Tue, 31 Dec 2019 (21:35 IST)
Updated Date: Tue, 31 Dec 2019 (21:37 IST)