Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే డాక్టర్ వద్దకెళ్ళాల్సిన అవసరం లేదు..

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళప్రదానికి నిమ్మపండు ప్రతీక. నిమ్మపండు ఆరోగ్యరీత్యా మేలు చేయడంతో పాటు ఆధ్యాత్మికపరంగాను ఉపయోగపడుతుంది. నిమ్మలోని గుణాలు,

ఆ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే డాక్టర్ వద్దకెళ్ళాల్సిన అవసరం లేదు..
, శుక్రవారం, 5 జనవరి 2018 (19:18 IST)
పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళప్రదానికి నిమ్మపండు ప్రతీక. నిమ్మపండు ఆరోగ్యరీత్యా మేలు చేయడంతో పాటు ఆధ్యాత్మికపరంగాను ఉపయోగపడుతుంది. నిమ్మలోని గుణాలు, వాటిని ఉపయోగించడం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. 
 
పసుపు రంగు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ రంగులో ఉండే నిమ్మపండు సకల శుభాలను అందిస్తుంది. అధర్వణ వేద కాలంలో తొలుత దేవతలు, ఆది దేవతలకు పరిహార పూజ చేసేటప్పుడు నిమ్మపండును ఇవ్వడం ఆనవాయితీ అని చెపుతారు.
 
నిమ్మపండును జీవ పండుగా పిలుస్తుంటారు. సైన్స్ పరంగా చూస్తే నిమ్మలో సిట్రస్ ఆమ్లాలు ఉన్నాయి. ఈ సిట్రిక్ యాసిడ్ క్రిమినాశినిగా పనిచేస్తోంది. పిత్త, కఫ వ్యాధులను నయం చేస్తోంది. నిమ్మచెట్టు ఇంట్లో వుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. నిమ్మ పండును ఇంటి ద్వారానికి కడితే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నిమ్మపండును కట్ చేసి ఇంటి ద్వారాలకు ఇరువైపులా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నిమ్మపండుతో దిష్టి తీస్తే దృష్టి పోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...?