నిద్ర లేవగానే రాగి పాత్రలోని నీరు తాగితే?

బుధవారం, 7 ఆగస్టు 2019 (20:56 IST)
రాగి చెంబులో నీరు తాగడం వల్ల శరీరంలోని రోగకారకాలను దూరం చేస్తుంది. రాగి చెంబుతో నీటిని సేవించడం, రాగి పాత్రల్లో ఆహారం తీసుకోవడం ద్వారా జ్వరం, జలుబు దరిచేరదు. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో చక్కెర నిల్వల స్థాయిని క్రబమద్ధీకరిస్తుందని చెపుతారు. 
 
రాగితో చేసిన గాజులు ధరించడం ద్వారా ఇస్నోమియా, న్యూరోసిస్, హైబీపీ వంటి వాటిని నియంత్రించుకోవచ్చు. వివాహం అయిన తర్వాత సంతానలేమి బాధపడేవారు దంపతులు.. రాగి చెంబులు, గ్లాసులు ఉపయోగించడం మేలు. వంటలు చేసేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించవచ్చు. ఫలితంగా దంపతుల శరీరంలో సంతానలేమి గల రుగ్మతలు తొలగిపోయే ఆస్కారం ఉందట. 
 
రాగి చెంబులో రాత్రి పూట నీరు ఉదయం నిద్రలేవగానే తాగడం చాలా మంచిది. అలా తాగితే కడుపులో ఉన్న టాక్సిన్లు తొలగిపోతాయి. తద్వారా ఎసిడిటీ, కిడ్నీ, లివర్ సమస్యలు తగ్గిపోతాయి. రాగి పాత్రల్లో నీటిని వేడిచేసి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా చర్మ సంబంధిత రోగాలు దరిచేరవు. రాగిపాత్రల్లో నీళ్లు వుంచితే వాటిలో క్రిములు చేరే అవకాశం ఉండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
రాగి చెంబులో ఉంచిన నీటిని తాగడం ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు నయమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. నిత్యయవ్వనులుగా మారుతారట. హృద్రోగ సమస్యలు ఉత్పన్నం కావు. రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ క్రమంగా వుంటాయి. థైరాయిడ్ సమస్యలు దూరం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆపరేషన్ చేయించుకునే వారు తులసీ ఆకులు తినడం, తులసీ నీటిని తాగితే ఏమవుతుంది?