చైనాకు చెందిన 44 ఏళ్ల టాన్ఓ నాన్ అనే వ్యక్తి మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పార్టీలో ఫూటుగా మద్యం సేవించాడు. పార్టీ అయిపోయాక స్నేహితులందరూ వెళ్లిపోవడంతో అప్పటికే మందు ఎక్కువ కావడం వల్ల మంచంపై పడి వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయాడు.
అంతవరకు బాగానే ఉంది, అయితే ఉదయాన్నే మెళకువ వచ్చిన టాన్‌కు తన మర్మాంగం దగ్గర నొప్పి అనిపించడంతో ఏం జరిగిందా అని చూసుకున్న అతనికి ఊహించని షాక్ తగిలింది. అంతే గుండె ఆగినంతపనైంది. ఎందుకంటే అతని మర్మాంగాన్ని ఎవరో కోసేసారు. అక్కడ రక్తం మాత్రం కారుతోంది.
దీంతో ఏమి చేయాలో తెలియక చుట్టుపక్కలా వెతుకుతున్న అతనికి మంచం పక్కనే తన మర్మాంగం పడి ఉండటం కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొని దగ్గరలోని ఆస్పత్రికి పరిగెత్తాడు. అయితే ఆ హాస్పిటల్‌లో మర్మాంగాన్ని అతికించే శస్త్రచికిత్సకు కావలసిన పరికరాలు లేకపోవడంతో అతన్ని మరో హాస్పిటల్‌కు వెళ్లమని చెప్పారు.
అలా చాలా హాస్పిటల్స్ తిరిగిన తర్వాత చంగ్‌షా హాస్పిటల్‌లోని నిపుణులైన వైద్యులు ఆపరేషన్ చేసి అతని మర్మాగాన్ని తిరిగి అతికించారు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, ఇలా ఎవరు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని టాన్ వాపోయాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలోనే ఉన్నాడని, నెమ్మదిగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.