తలనొప్పి ప్రతీ ఒక్కరికి ఎదురైయ్యే సమస్య. ఇది వయసు తేడా లేకుండా ఎవరు పడితే వారికి వచ్చేస్తుంటుంది. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందంటే.. పనిఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అలానే ఆందోళన అధికమైనప్పుడు ఈ సమస్య తీవ్రంగా బాధిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తే కూడా తలనొప్పి వస్తుంది. ఇలాంటి తలనొప్పిని తగ్గించాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం..
1. గ్లాస్ మంచి నీటిలో కొద్దిగా ధనియాల పొడి, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ నీటిని ప్రతిరోజూ క్రమంగా తీసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
2. ఒక్కోసారి నిద్రలేమి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. కనుక రోజూ సరియైన సమయానికి నిద్రించండి. తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
3. రాత్రివేళ మీరు చేసే భోజనంలో నెయ్యి వేసి తీసుకుంటున్నారా.. వద్దు వద్దూ అలా చేస్తే తలనొప్పి ఎక్కువవుతుంది. ఒకవేళ అలా జరిగినప్పుడు వెంటనే స్పూన్ వెల్లుల్లి రసాన్ని తాగండి.. తక్షణం ఉపశమనం లభిస్తుంది.
4. రాత్రి సమయంలో నిద్రించే ముందుగా ఓ బకెట్ వేనీళ్లు తీసుకుని అందులో పాదాలను పావుగంట పాటు అలానే ఉంచాలి. ఇలా చేయడం వలన తలనొప్పి తగ్గుతుంది. ఇలా మూడు వారాల పాటు క్రమంగా చేయాలి.
5. తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక్కోసారి కళ్లు కూడా తిరుగుతాయి. అలాంటప్పుడు.. చాక్లెట్ తీసుకుంటే.. చాలు. తలకు నూనె రాసుకోకపోతే కూడా తలనొప్పి వస్తుంది.. అందువలన కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వేడి చేసుకుని ఆ నూనెను తలకు రాసుకుని చూడండి.. ఫలితం ఉంటుంది.