నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి అంతే మేలు చేస్తుంది. నెయ్యిలోని ఖనిజ లవణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. నెయ్యి చర్మానికి మంచి ప్యాక్‌లా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై గల మృతుకణాలను తొలగిస్తాయి. అంతేకాదు.. విటమిన్ ఇ నెయ్యిలో అధిక మోతాదులో ఉంది. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ ప్రయోజనాలున్న నెయ్యితో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి దానికి తోడుగా కొద్దిగా నిమ్మరసం, పసుపు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు అలానే ఉంచుకోవాలి. ఆపై చల్లని నీటితో కడుక్కుంటే.. ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా.. మృదువుగా తయారవుతుంది.
స్పూన్ నెయ్యిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దీంతో చర్మం కొత్త నిగారింపు పొందుతుంది.
కంటి అలసటకు చెక్ పెట్టాలంటే.. నెయ్యిలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా కంటి కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన కంటి అలసట తగ్గడమే కాకుండా.. నల్లటి వలయాలు కూడా పోతాయి.