ధనియాలు అంటే తెలియని వారుండరు. వీటిని అనేక రకములైన వంటలలో ఉపయోగిస్తుంటాము. ధనియాలు వంటలలోనే కాదండోయ్...... ఒక మంచి ఔషధంలా కూడా ఉపయోగపడతాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఎలాగో చూద్దాం.
1. ధనియాలతో తయారుచేసే కషాయం వల్ల చాలా లాభాలున్నాయి. ధనియాలను బాగా నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ కషాయం తాగడం వల్ల వెంటనే జలుబు తగ్గిపోతుంది. అలాగే ధనియాలను రోజువారి తినే ఆహారంలో ఉండేటట్లు చూసుకోవడం వల్ల శరీరంలోని షుగర్ శాతం కూడా తగ్గుతుంది.
2. ధనియాలను రోజూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
3. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగడం వల్ల మంచి నిద్రపడుతుంది.
4. శరీరంలోని కొవ్వుని కరిగించడానికి కూడా ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలను మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని దాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
5. ధనియాలను తరచూ ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకుంటే శృంగార శక్తి కూడా పెరుగుతుంది.
6. చర్మ సంరక్షణకు ధనియాలు బాగా ఉపయోగపతాయి. ధనియాలను మెత్తగా చూర్ణంలా చేసుకుని, ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
7. ధనియాలను ఏదో రకంగా రోజూ తీసుకుంటే షుగర్ వ్యాధిని అడ్డుకుంటుంది. అంతేకాకుండా టైఫాయిడ్ వచ్చినప్పుడు ధనియాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.