Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు పెరిగారో కళ్లకు ముప్పే గుర్తుంచుకోండి..

గంటల పాటు కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారా? వ్యాయామానికి దూరమవుతున్నారా? జంక్ ఫుడ్ తీసుకుంటున్నారా? ఇవన్నీ శరీర బరువును పెంచేస్తాయి. తద్వారా ఊబకాయం వంటి సమస్యలతో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. మధుమేహం

బరువు పెరిగారో కళ్లకు ముప్పే గుర్తుంచుకోండి..
, శుక్రవారం, 24 నవంబరు 2017 (15:20 IST)
గంటల పాటు కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారా? వ్యాయామానికి దూరమవుతున్నారా? జంక్ ఫుడ్ తీసుకుంటున్నారా? ఇవన్నీ శరీర బరువును పెంచేస్తాయి. తద్వారా ఊబకాయం వంటి సమస్యలతో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. మధుమేహం నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది. అలాగే కంటికి కూడా అధిక బరువు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
కంటి రెటీనా నుంచి మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే ఆప్టిక్ నెర్వ్ దెబ్బతినడం వల్ల ఏర్పడే సమస్యనే గ్లకోమా అంటారు. ఈ ఇబ్బందికి అధిక బరువే కారణమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెరగకుండా చూసుకోవాలి.  పైకి లక్షణాలు కనిపించవు, కానీ చూపు మాత్రం దెబ్బతినిపోతుంది. ఆలస్యంగా గుర్తిస్తే కంటి చూపు పూర్తిగా కోల్పోతారు. గ్లకోమా వచ్చి కంటి చూపు కోల్పోతే మళ్లీ కంటిచూపును పొందడం కుదరదు.
 
అందుచేత బరువు పెరగకుండా కంటి ఆరోగ్యానికి పోషకాహారం తీసుకోవడం ద్వారా కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు. ముదురు ఆకుపచ్చటి కూరగాయలు, పండ్లను ఎక్కువగా డైట్‌లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పాలకూరను మరిచిపోకూడదు. చేపలు కంటిచూపును కాపాడే మంచి బలమైన ఆహారం. వీటిలో ఉండే ఓమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ కంటిని రక్షిస్తాయి. 
 
చేపలు తినలేని వారు వాల్ నట్స్ తీసుకోవడం బెటర్. వీటిలోనూ ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారట్లు కళ్లకు మంచివి. రోజు అర ముక్య క్యారెట్‌ను నమిలి తినడం ద్వారా కంటి ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బట్టతలకు చెక్ పెట్టే నెయ్యి..