కడుపు నిండా తింటే ఒబిసిటీ తప్పదు..

ఒబిసిటీ నుంచి తప్పుకోవాలంటే.. కడుపు నిండా తినడం ముందు మానాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోనేటప్పుడు ఆహారాన్ని నమిలి తినడం మంచిది. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వ

గురువారం, 9 నవంబరు 2017 (16:39 IST)
ఒబిసిటీ నుంచి తప్పుకోవాలంటే.. కడుపు నిండా తినడం ముందు మానాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోనేటప్పుడు ఆహారాన్ని నమిలి తినడం మంచిది. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. కోడిగుడ్లు, మొక్కజొన్న, ఆపిల్, బ్రొకొలి వంటివి తీసుకోవాలి. ఇందులోని క్రోమియం ఇన్సులిన్ శాతాన్ని రెట్టింపు చేస్తాయి. ఇంకా వేరుశెనగలు, వాల్‌నట్స్, సన్ ఫ్లవర్ గింజలు, శెనగలు, పెసళ్లు వంటివి డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. వీటితో పాటు వ్యాయామం మంచి నిద్రను, ఉత్సాహాన్నిస్తుంది. 
 
బరువు తగ్గాలనుకునే మూడు పూటలు భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా తగినంతగా లభిస్తాయి. నిద్రలేచిన పెండు గంటల్లోపే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది. రోజూ పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంత మేరకు తగ్గించగలదు. 
 
భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారు. వారంలో మూడు రోజులు గుడ్లు, ఒక పూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పరగడుపున మంచినీళ్లు తాగితే...