ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే సబ్జా గింజలను వేడినీటిలో నానబెట్టి పాలలో కలిపి మధ్యాహ్నం పూట త్రాగితే శరీరం లోని అధిక వేడి తగ్గుతుంది.
ఇంకా వెల్లుల్లి వాడటం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు అదుపులో వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఉదయం బ్రెష్ చేసుకొనేటప్పుడు బ్రెష్ పై కొంచెం నిమ్మరసం పిండుకొని బ్రెష్ చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి.
ధనియాలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
శరీరంపై ఎక్కడైనా కాలినప్పుడు ఆ ప్రదేశంలో తేనె రాస్తే బొబ్బలు ఏర్పడకుండా ఉంటాయి.
ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల తేనే కలుపుకొని పడుకోబోయే ముందు త్రాగితే మంచి నిద్ర పడుతుంది.
మూత్రపిండాల సమస్య ఉన్న వారు అరటిపళ్ళు తినకపోవడం మంచిది.
ఎక్సిమా వంటి చర్మ వ్యాధులు నివారణకు ఖర్జురా పండ్ల రసం బాగా పనిచేస్తుంది.
కారాన్ని అధికం గా వాడితే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.