ఫ్యాషన్ అనేది పెద్దలకే కాదు పిల్లలకూ చాలా ముఖ్యం. సీజనల్ వారీగా పిల్లల ఫ్యాషన్ పట్ల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. అప్పుడే పిల్లలు పెరిగే కొద్దీ వారి ఆహార్యంలో పురోగతి వుంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది.
దుస్తులు ధరించడానికి కొన్ని మార్పులు చేయడం అవసరం. అవి పెళ్లికి, పార్టీకి లేదా విహారయాత్రకు బయలుదేరడానికి ఇలా వేటికవి ప్రత్యేకంగా వుండేలా చూసుకోవాలి. అంతేగాకుండా సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవాలి. బిగుతు, దుస్తులు చాలా వదులుగా వుండే దుస్తులు ఎంచుకోకూడదు.
బాలికలకు వర్షాకాలం శీతాకాలంలో బూట్, వెచ్చని ఓవర్ఆల్స్‌తో అందమైన కనిపించే దుస్తులను ఎంచుకోవడం మంచిది. అబ్బాయిలు కోసం కిడ్స్ ఫ్యాషన్ బట్టి దుస్తులను ఎంచుకోండి. బట్టలు కొనుగోలు చేసేటప్పుడు అబ్బాయైనా అమ్మాయైనా వారికి నచ్చడంతో పాటు ప్రకాశవంతమైన దుస్తులను ఎంచుకోవాలి.
వర్షాకాలానికి అనువైన దుస్తులను అంటే కాటన్ లా కాకుండా కాస్త సిల్క్ దుస్తులు తడి బట్టేవి కాకుండా.. సులభంగా ఎండిపోయే దుస్తులను కొనుగోలు చేయాలి. అలాగే బూట్లు.. వాటికి అదనపు వెచ్చని సాక్స్ ధరించడం చేయాలి. ముఖ్యంగా పరిశుభ్రతను గుర్తుంచుకోవాలి. ఫ్యాషన్‌కు పరిశుభ్రత తోడైతే పిల్లలకు అనారోగ్యం వెంటాడదు.