పుట్టగొడుగులతో మధుమేహ వ్యాధికి చెక్...
పుట్టగొడుగులను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగులు తీసుకోవడం వలన లివర్ గ్లూకోజ్ నియంత్రనకు ఉపయోగపడుతాయి. తద్వారా మధుమేహం అదుపులో
పుట్టగొడుగులను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగులు తీసుకోవడం వలన లివర్ గ్లూకోజ్ నియంత్రణకు ఉపయోగపడుతాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. పుట్టగొడుగులు జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియాకు సహకారం అందించి వాటిని శక్తివంతంగా చేస్తాయి.
పుట్టగొడుగుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ గుణాలు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. ఈ పుట్టగొడుగులను తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఎందుకంటే కార్బొహైడ్రేట్స్ పుట్టగొడుగుల్లో తక్కువగా ఉంటాయి. అందుచేత డయాబెటిస్ ఉన్నవారికి పుట్టగొడుగులు చక్కని ఆహారంగా చెప్పవచ్చును. దీంతో అధిక బరువు కూడా తగ్గుతారు.