Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండలు బాబోయ్... ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి?

Advertiesment
good food
, శనివారం, 23 మే 2020 (20:58 IST)
ఎండలు ముదురుతున్నాయి. ఎప్పట్లానే ఏదిబడితే అది తినకూడదు. కాలాలకు తగ్గట్లుగా మన ఆహారంలోనూ మార్పులు చేసుకుంటూ వుండాలి. ఆ మార్పులు ఎలా వుండాలో చూద్దాం.
 
1) ఆహారపదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీరు బాగా తాగాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
 
6) శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
7) కాఫీ, టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
 
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్‌లు చేసుకుని తాగాలి.
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13. తాటి ముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
14. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పిటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
15. వేసవిలో బయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి 
 
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS  పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటే మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీనివలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20. వేసవికాలంలో బయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్లకాయను మగవారు తీసుకుంటే ఏమవుతుంది?