సోంపు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇప్పుడు సోంపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
బాగా నిద్రపట్టేందుకు సోంపు... 250 మిల్లి లీటర్ల నీటిలో 10 గ్రాముల సోంపు గింజలను వేసి సగం నీరు మిగిలేలా సన్నని మంటపై మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడబోసి 100 మి. లీటర్లు కాచిన పాలు ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ పటికబెల్లం పొడి కలిపి రాత్రి పడుకునే సమయంలో సేవించాలి.
దగ్గు, ఆయాసం, జలుబు తగ్గేందుకు, సోంపు గింజల పొడి 25 గ్రాములు, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరికే అతిమధుర చూర్ణం 50 గ్రాములు, పటికబెల్లం పొడి 75 గ్రాములు కలిపి వుంచుకుని రోజుకి రెండుపూటల పూటకు అర టీ స్పూను పొడిని 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి సేవించాలి.