Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాదం పప్పులు తింటే రక్తహీనత తగ్గుతుందా?

Advertiesment
consumption
, మంగళవారం, 18 మే 2021 (22:58 IST)
ఈ విషయంపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ, బాదం రక్తహీనతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది రాగి మరియు ఇనుమును కలిగి ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ సంశ్లేషణకు సహాయపడుతుంది. బాదంను అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుంది. 
 
బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలి.. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. అంతే బాదం పాలు రెడీ. బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. అందుకే మీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదం మిల్క్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉండటం, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఫిష్‌లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో అధికంగా ఉంది. అందువల్ల ఇది గుండె జబ్బులను మరియు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. ఇకపోతే.. బాదం పాలు కండరాలు బలోపేతం అవుతాయి. నొప్పులను నివారిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాళీ కడుపుతో ఉసిరి తినవచ్చా?