Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోంగూర తర్కా ఆల్మండ్‌

Advertiesment
గోంగూర తర్కా ఆల్మండ్‌
, ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (20:55 IST)
శరీరానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో అవసరం. ముఖ్యంగా బాదములు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బాదములతో గోంగూర తర్కా ఆల్మండ్‌ ఎలా తయారూ చేయాలో చూద్దాం. ఇది ముగ్గురు లేదా నలుగురికి సరిపడేలా చేసుకోవచ్చు.
 
కావాల్సిన పదార్థాలు:
బాదములు- ముప్పావు కప్పు, గోంగూర పచ్చడి- ఒక టేబుల్‌ స్పూన్‌, గుంటూరు ఎండుమిర్చి- 2 పీసులు, ఆలీవ్‌ నూనె- 1 టేబుల్‌ స్సూన్‌, ఉప్పు- రుచికి తగినంత, తాజా కొబ్బరి- అరకప్పు, కరివేపాకు- ఒక టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం- 2 టీస్సూన్‌, అల్లంముక్కలు- 1 టేబుల్‌ స్పూన్‌, గ్రీన్‌ చిల్లీ- 1 టీస్పూన్‌, నల్ల ఆవాలు- అర టీస్పూన్‌, మినపప్పు- 1 టీస్పూన్‌.
 
తయారీ విధానం:
* ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్‌ వద్ద బాదములు నాలుగు నిమిషాలు వేయించాలి. ఆ తరువాత చల్లార్చి సన్నగా వాటిని తరగాలి.
 
* ఓ పాన్‌లో ఆలీవ్‌ నూనె తీసుకుని గుంటూరు చిల్లీ, ఆవాలు, మినపప్పు వేసి పప్పు గోధుమ రంగులోకి వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు కరివేపాకు అల్లం, పచ్చి మిరపకాయలు కలిపి 15 సెకన్లు వేయించాలి.
 
* ఇప్పుడు తాజా కొబ్బరి, గోంగూరు పచ్చడి కూడా కలపాలి
 
* అనంతరం ముందుగా ఉంచుకున్న బాదములు వీటికి బాగా కలిపి, పైన నిమ్మరసం చల్లి సర్వ్‌ చేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకవైపు కరోనా, మరోవైపు ఎండదెబ్బ, ఏం చేయాలి?