Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్ జ్యూస్‌తో స్పెర్మ్ కౌంట్ అప్..

క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తలెత

Advertiesment
క్యారెట్ జ్యూస్‌తో స్పెర్మ్ కౌంట్ అప్..
, మంగళవారం, 3 అక్టోబరు 2017 (11:36 IST)
క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తలెత్తవు. మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ దూరమవుతుంది. క్యారెట్లలో వుండే విటమిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. 
 
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. క్యారట్ జ్యూస్ ద్వారా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అలాగే ఆరోగ్యంగా వుండాలంటే.. 
దాల్చిన చెక్క పొడిని డైట్‌లో చేర్చుకోండి.ఇది తీసుకుంటే  బ్యాక్టీరియాను నశిస్తుంది. ఇందులో పుష్కలంగా యాంటీయాక్సిడెంట్లు వుంటాయి. అలాగే కొబ్బరినీరు తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌ను పెంచి చురుకుగా వుండేలా చేస్తుంది. వేరుశెనగలు తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.
 
రాగిలో కాల్షియం ప్రధాన వనరుగా దొరుకుతుంది. ఎముకల ధృడత్వానికి దోహద పడుతుంది. క్యాప్సికం ఆహారంలో తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంకాయ కూరతో బరువు తగ్గండి..