Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెంతి పొడిని మొదట అన్నం ముద్దలో తింటే ఏమవుతుంది? (video)

Advertiesment
మెంతి పొడిని మొదట అన్నం ముద్దలో తింటే ఏమవుతుంది? (video)
, గురువారం, 11 జులై 2019 (19:49 IST)
ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆకుకూరలు మన ఆరోగ్యానికి పలు రకాలుగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిల్లో మెంతికూర ఒకటి. ఇందులో అనేక రకములైన పోషకాలు దాగి ఉన్నాయి. అదేవిధంగా మెంతులలో కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. మెంతులు, మెంతి కూరలో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ సహజ స్థితిలో ఉంటాయి. వీటివల్ల మన ఆరోగ్యానికి గల ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. మెంతి కూర జీర్ణ శక్తిని పెంచి జీర్ణమైన ఆహారం శరీరానికి ఒంటబట్టేలా చేయడమే కాక మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది ప్రేగుల్లోని కండను కరిగించి పేరుకుని ఉన్న మాలిన్యాలను తొలగించి జీర్ణవాహికను శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
 
2. మెంతికూర మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల్ని సవరిస్తుంది. మెంతి ఆకులు నూరి  ముద్దలో కొంచెం నెయ్యి కలిపి ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాచిన గడ్డలపై కడితే వాపు, గడ్డ తగ్గుతాయి.
 
3. మెంతులు అంతర్గతంగా మన జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి.శరీరంలో పెరుగుతున్న కొవ్వుని, అధిక బరువుని తగ్గిస్తాయి. ఒక స్పూను మెంతులు, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో నానబెట్టి ఉదయం పరగడుపున తాగడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు.
 
4. ఆడవాళ్లల్లో బహిష్టు సమయంలో సాదారణంగా వచ్చే నొప్పికి మెంతులు మంచి ఔషదంలా పని చేస్తాయి.ఆ సమయంలో మెంతికూర తినడం చాలా మంచిది.
 
5. ఒక స్పూను మెంతులు ఒక కప్పు పెరుగులో కానీ లేదా మజ్జిగలో కానీ నానబెట్టి తీసుకోవడం వలన విరేచనాలు, జిగటవిరేచనాలు తగ్గుతాయి.
 
6. మెంతి పొడిని మొదట ముద్దలో తినడం వల్ల షుగరు వ్యాధి అదుపులో ఉంటుంది. అంతేకాకుండా రక్త హీనత తగ్గుతుంది.
 
7. మెంతిపొడి పావుగ్లాసు నీళ్లతో మరగనిచ్చి చల్లారిన తరువాత తీసుకుంటే గొంతులో కఫం తగ్గి, జలుబు, దగ్గు తగ్గుతాయి.మెంతికూర ఉడికించి పట్టులా వేసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. వారంలో కనీసం మూడుసార్లయినా మెంతికూర తింటే శరీరం ప్రకాశవంతమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈగల కాలం.... తులసి ఆకులు నమిలితే ఏమవుతుందో తెలుసా?