Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలిచలిగా చలికాలం... మంచి మూడ్‌లోకి రావాలంటే గోరువెచ్చని వేడినీటి స్నానం

బిజీ లైఫ్. క్షణం తీరకలేని జీవితం. అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలూకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు దీనికి మిం

Advertiesment
Bathing with mild hot water
, శనివారం, 26 నవంబరు 2016 (19:49 IST)
బిజీ లైఫ్. క్షణం తీరకలేని జీవితం. అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలూకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేదు. 
 
చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్లోకి వచ్చేస్తారు. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. తడి టవల్‌ను తలకు చుట్టుకుని కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. మంద్రమైన సంగీతాన్ని ఆస్వాదించండి. 
 
ఇన్నింటి నడుమ వేడి నీటి స్నానం చేసి చూశాక కాని అర్థం కాదు. దాని మత్తు ఏమిటో. ఇంకా నచ్చితే‌ టబ్ స్నానం చేసేవారు కొద్దిసేపు అలాగే పడుకుని నచ్చిన ఏదోక పుస్తకమో చదువుకోవచ్చు. అలా చేయడం వలన కొద్ది నిమిషాల తరువాత అధ్బుతమయిన ఆనందం స్వంతం అవుతుంది. కాంతులతో తాజాగా బయటకు వచ్చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబరులోనే చంపేస్తున్న చలిపులి... ముక్కు దిబ్బడ, గొంతులో గరగర... ఇవే చిట్కాలు...