Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబరులోనే చంపేస్తున్న చలిపులి... ముక్కు దిబ్బడ, గొంతులో గరగర... ఇవే చిట్కాలు...

నవంబరు నెలలోనే చలి పులి చంపేస్తుంది. చలికాలంలో ముఖ్యంగా డిసెంబరు, జనవరి నెలల్లో మనుషుల్లో జఠరాగ్ని అంటే మన జీర్ణకోశం, దాని శక్తి చక్కగా వృద్ధి చెందుతుంది. తీవ్రమైన మంచు మన శరీరంపై వున్న వెంట్రుకల రంధ్రాలని మూసివేసి లోపల వేడిని బయటకు రాకుండా అడ్డుకుంట

Advertiesment
Winter Health tips
, శనివారం, 26 నవంబరు 2016 (16:39 IST)
నవంబరు నెలలోనే చలి పులి చంపేస్తుంది. చలికాలంలో ముఖ్యంగా డిసెంబరు, జనవరి నెలల్లో మనుషుల్లో జఠరాగ్ని అంటే మన జీర్ణకోశం, దాని శక్తి చక్కగా వృద్ధి చెందుతుంది. తీవ్రమైన మంచు మన శరీరంపై వున్న వెంట్రుకల రంధ్రాలని మూసివేసి లోపల వేడిని బయటకు రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల ఈ చలికాలంలో ఆహారం తీసుకోకపోయినా, ఉపవాసం చేసినా పెరిగిన ఆ వేడి, అదే జఠరాగ్ని మన మాంస కండరాల శక్తిని తినేస్తుంది. జాగ్రత్త సుమీ!. 
 
ముక్కు దిబ్బడ అనిపించడం, గొంతులో గరగరమని దురద అనిపించడం ముందుగా మనకి కనిపించే చలి ప్రభావ లక్షణాలు. ఆ తర్వాత చలికి చెవులు మూసుకుపోయినట్టు అనిపించడం. దురద కనిపిస్తాయి. అక్కడ నుంచి ఎలర్జీ ఆరంభమై జలుబు లక్షణాలు వస్తాయి. దీని కోసం వేడినీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసుకొని ఆవిరిపట్టండి. చెవిలో గోరువెచ్చని నువ్వుల నూనె 2 చుక్కులు వేసుకోండి. పిల్లలలో ఏడెనిమిది మధ్య వయస్సువాళ్ళు ఈ చలికి వచ్చే లక్షణాల వల్ల తొందరగా బాధపడతారు. 
 
అలాగే ఈ కాలంలో వచ్చే చిన్నచిన్న రుగ్మతలను సహజ వనరులతో మనం కాపాడుకుంటే మనలోని వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో రక్తనాళాలు ముడుచుకుని ఉండడం వల్ల బి.పి పెరుగుతుంది. ముఖ్యంగా వేకువ జామున వ్యాయామం చేయండి. దానివలన రక్తప్రసారం పూర్తిగా జరిగి ఫిట్‌గా ఉంటారు. 
 
ముక్కు, గొంతుకలో ఏర్పడ్డ గట్టి కఫాన్ని బయటకు చీది వేడినీళ్ళతో ఆవిరి పట్టండి. రాత్రి పెరుగు తీసుకోవడం వలన అది కఫాన్ని పెంచుతుంది. దానిని విడిచిపెట్టండి. ఈ కాలంలో అల్లం టీ దీనికి బాగా పనిచేస్తుంది. రెండు వెల్లుల్లిపాయలు, అర చెంచా పసుపు నీళ్ళులో ఉడికించి త్రాగడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నారా? పాలపొడిని కలిపితే..?