Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ ఆహార దినోత్సవం: మీ నడుము చుట్టుకొలత పెరిగే కొద్దీ మీ ప్లేట్ స్థితి కూడా మారిపోతుంది

food
, సోమవారం, 16 అక్టోబరు 2023 (17:52 IST)
వస్త్రాలు బిగుతుగా మారినప్పుడు మాత్రమే బరువు తగ్గడం గురించి 58% మంది ఆలోచిస్తున్నారు, 46% మంది మాత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు కామెంట్ చేసినప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారు. 57% మంది సమోసాలు, చోలే భాతురే, కబాబ్‌లు మరియు గులాబ్ జామూన్‌లతో తమ విజయాలను వేడుక చేసుకుంటారు. కుటుంబ సమావేశాలు (57%), పండుగ సందర్భాలు(44%), ఒత్తిడితో కూడిన సమయాలు (35%) అనేవి మూడు అత్యంత కష్టమైన క్షణాలు, ఇవి ఎమోషనల్ ఈటింగ్‌కు దారితీస్తున్నాయి. భారతీయులు అధిక-తీవ్రత కలిగిన కార్డియో కార్యకలాపాలకు విరుద్ధంగా తేలికపాటి వ్యాయామాలు, నడకలను ఇష్టపడతారు.
 
ఆహారంతో భారతదేశం యొక్క సంబంధం, ఆరోగ్యంపై దాని ప్రభావం కేవలం సంతృప్తికరమైన భోజనం కంటే చాలా లోతైనది. సైకాలజీ-ఆధారిత వెల్‌నెస్, ఫిట్‌నెస్ ప్లాట్‌ఫారమ్ ఫిటెలో దేశవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో, 58% మంది తమ బట్టల పరిమాణం పెరిగినప్పుడు తమ బరువు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని వెల్లడించింది. 61% మంది మహిళలు తమ బరువు గురించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటుగా ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.
 
అక్టోబరు 16న ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ యువర్ ప్లేట్ అంటూ ఫిటెలో విడుదల చేసిన అధ్యయనంలో తరతరాలుగా భారతీయుల ప్రవర్తన, సాంస్కృతిక, సామాజిక మరియు భావోద్వేగ స్థితితో ఆహారపు అలవాట్లు లోతైన సంబంధం కలిగి ఉన్నాయని కనుగొంది. ఈ సర్వే 18 నుండి 63 సంవత్సరాల వరకు అన్ని వయస్సుల వ్యక్తులపై అన్ని భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో నిర్వహించబడింది. సెలబ్రిటీలు- సోషల్ మీడియా ప్రముఖులు ఆరోగ్య ఎంపికలను ప్రభావితం చేస్తారనే అభిప్రాయానికి భిన్నంగా, బరువు తగ్గించే కార్యక్రమాల విషయానికి వస్తే 76% మంది వ్యక్తులు తమ కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులచే ప్రభావితమవుతారని సర్వే కనుగొంది.
 
ఫిటెలో కోఫౌండర్ & సీఈఓ, సాహిల్ బన్సల్ మాట్లాడుతూ, “'స్టేట్ ఆఫ్ యువర్ ప్లేట్' నివేదిక దేశవ్యాప్తంగా ప్రజల ఆహార ఎంపికలను వెల్లడించడమే కాకుండా, ఆహారం, ఫిట్‌నెస్, ఆరోగ్యం మధ్య సంబంధాన్ని కూడా వెలుగులోకి తెస్తుంది" అని అన్నారు. ఫిటెలో సహవ్యవస్థాపకుడు & సీఎంఓ మెహక్‌దీప్ ‘మ్యాక్’ సింగ్ మాట్లాడుతూ, “స్టేట్ ఆఫ్ యువర్ ప్లేట్ అధ్యయనం భారతదేశంలో ఆరోగ్యం- ఫిట్‌నెస్‌పై సమగ్ర సమాచారం అందిస్తుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహం వున్నవారు ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు