అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య సేవలనందించిన వంద పడకల మల్టీ స్పెషాలిటీ టెరిషయరీ, క్వాటెర్నరీ లెవల్ కేర్ హాస్పిటల్ సియా లైఫ్ హాస్పిటల్స్ నేడు ఓ వాకథాన్‌ను అంతర్జాతీయ మధుమేహ దినోత్సవ సందర్భంగా కొండాపూర్‌లోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న నేరెళ్ల లేక్ పార్క్ వద్ద నిర్వహించింది. ఈ వాకథాన్ కొండాపూర్‌లోని సియా లైఫ్ హాస్పిటల్ వద్ద ముగిసింది. సామాన్య ప్రజల నడుమ మధుమేహం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వాక్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు, సియా లైఫ్ డాక్టర్లు, సిబ్బంది ఈ వాక్‌లో పాల్గొన్నారు.
అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం పురస్కరించుకుని పలు పార్క్‌లలో మధుమేహ పరీక్షలను సైతం చేసింది. ఈ పరీక్షలలో ఎవరికైనా చికిత్స అవసరమైన పక్షంలో వారికి కూపన్లు అందజేసి సియా లైఫ్ హాస్పిటల్స్ వద్ద వాటిని కన్సల్టేషన్/పరీక్షలకు మార్చుకునే అవకాశం కల్పించింది. రేపటిని కాపాడుకోవడం కోసం అవగాహన మెరుగుపరచడం అనే నేపథ్యంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు . ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలను సియా లైఫ్ నిర్వహిస్తుంది.
సియా లైఫ్ హాస్పిటల్‌లో డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ ,డాక్టర్ సి అభినందన మాట్లాడుతూ తగిన రీతిలో జీవనశైలి ఉండకపోవడం, సరైన డైట్ అనుసరించకపోవడం వల్ల ఇటీవలి కాలంలో మధుమేహుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనికి తోడు మధుమేహ లక్షణాలను సైతం ప్రజలను గుర్తించలేకపోవడం వల్ల మరింతగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడంతో పాటుగా మధుమేహ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం అవసరం అని అన్నారు.
తమ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకుంటున్న రోగులకు ఈ వాక్‌థాన్‌లో భాగంగా సత్కరించారు. ఈ వాకథాన్‌లో పాల్గొనడం వల్ల మధుమేహ నివారణ, నియంత్రణ గురించి మరింతగా తెలుసుకునే అవకాశం తమకు లభించిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారన్నారు.