Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో మరణాలకు రెండవ అత్యధిక కారణంగా నిలుస్తున్న శ్వాస సంబంధిత సమస్యలు

Advertiesment
Respiratory Ailments
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (21:03 IST)
అంతర్జాతీయంగా వ్యాధుల భారంపై యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ అధ్యయనంలో, భారతదేశంలో గుండె వ్యాధుల తరువాత అత్యధిక మరణాలకు కారణమవుతున్న రెండవ కారణంగా శ్వాస సంబంధిత వ్యాధులు నిలుస్తున్నాయి. ఒక సంవత్సరంలో ఒక మిలియన్‌కు పైగా భారతీయులు మృత్యువాత పడటానికి ఇది కారణమైంది.


శీతాకాలం తనతో పాటుగా ప్రతికూల వాతావరణం కూడా తీసుకురానుంది. ఇది శ్వాససంబంధిత సమస్యలైనటువంటి పొడిదగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో అసౌకర్యం, ఊపిరి ఆడని స్థితి వంటి లక్షణాలకూ కారణమవుతుంది. అదనంగా, గాలి నాణ్యత సరిగా లేకపోవడంతో పాటుగా కోవిడ్‌-19 మహమ్మారి సైతం ఊపిరితిత్తుల ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను మరింతగా గుర్తించేలా చేసింది.

 
లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం 1990లో 28.1 మిలియన్‌ మంది శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ సంఖ్య ఇటీవలి కాలంలో 55.3 మిలియన్‌ల మందికి చేరింది. ప్రపంచ జనాభాలో 18% వంతు ఇక్కడే ఉంది కానీ 32% శ్వాస సంబంధిత వ్యాధుల భారం ఇది మోస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఈ అనారోగ్యాల బారినపడిన వారిని చూసిన వారమే. అది మన పిల్లల పరంగా లేదా తల్లిదండ్రులు లేదా చుట్టు పక్కల వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం చూసే ఉంటాం.

 
డాక్టర్‌ బాత్రాస్‌ హెల్త్‌కేర్‌ ఇప్పుడు ఆక్సీలంగ్‌ను పరిచయం చేసింది. సమగ్రమైన ఊపిరితిత్తుల ఆరోగ్య చికిత్స కార్యక్రమమిది. దీనిలో ఊపిరితిత్తుల పరీక్ష, హోమియోపతిక్‌ నెబులైజేషన్‌ భాగంగా ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల పరీక్ష-హాస్పిటల్‌ గ్రేడ్‌, ఖచ్చితత్త్వంతో కూడిన శాస్త్రీయ పరీక్ష. ఇది కంప్యూటరైజ్డ్‌ పరీక్ష మరియు నొప్పి లేనటువంటిది. ఇది రోగులు తమ ఊపిరితిత్తుల సామర్థ్యం, వాల్యూమ్‌, శ్వాస సామర్థ్యం తెలుసుకునేందుకు తోడ్పడుతుంది.

 
సంప్రదాయ స్టెరాయిడ్లతో కూడిన నెబులైజర్లు కారణంగా గొంతు నొప్పి, ముక్కు కారడం, నోటి వ్యాధులు రావడం (ఇవి దీర్ఘకాలం ఉండటంతో పాటుగా పిల్లలతో పాటుగా పెద్దలపై కూడా తీవ్ర దుష్పలితాలు కలిగించవచ్చు) వంటి సమస్యలు వస్తుంటాయి.

 
డాక్టర్‌ బాత్రాస్‌ హోమియోపతిక్‌ నెబులైజర్‌లో హోమియ్‌పతి ఔషదాలను సురక్షితమైన, సహజమైన మరియు దుష్పరిణామాలు లేని రీతిలో అందిస్తారు. శ్వాస సంబంధిత అలెర్జీలతో బాధపడుతున్న రోగులు డాక్టర్‌ బాత్రాస్‌ హోమియోపతిక్‌ నెబులైజర్‌తో సులభంగా శ్వాసించగలరు. డాక్టర్‌ బాత్రాస్‌ హోమియోపతిక్‌ నెబులైజర్‌ ఉపకరణంతో హోమియోపతి ఔషధాలను వేగంగా పనిచేయించవచ్చు. దీనివల్ల రోగి వేగంగా కోలుకోవడంతో పాటుగా కోరుకున్న  ఫలితాలను సహజంగా, దుష్పలితాలు లేని రీతిలో పొందగలరు. ఈ నెబులైజర్‌, హోమియోపతి ఔషదం నేరుగా మీ శ్వాస నాళాల్లో చేరేందుకు సహాయపడుతుంది. దీనివల్ల మీ శ్వాస సంబంధిత సమస్యలకు వేగంగా మరియు మరింత ప్రభావవంతంగా చికిత్స చేయడం వీలవుతుంది.

 
ఆక్సీలంగ్‌ ఆవిష్కరణ గురించి డాక్టర్‌ ముఖేష్‌ బాత్రా, పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు వ్యవస్థాపకుడు, డాక్టర్‌ బాత్రాస్‌హెల్త్‌కేర్‌ మాట్లాడుతూ, ‘‘శ్వాస సంబంధిత సమస్యలకు మెరుగైన చికిత్సనందించడంలో హోమియోపతికి తగిన సామర్ధ్యం ఉంది. అత్యుత్తమ ఫలితాలను శాస్త్రీయ మరియు గుణాత్మక హోమియోపతి విధానంలో తీసుకురావడంలో  మేమెప్పుడూ ముందే ఉంటుంటాం. మా నిష్ణాతులైన హోమియోపతి నిపుణులు ప్రత్యేకంగా శ్వాస సంబంధిత చికిత్సా పరిష్కారాన్ని తీర్చిదిద్దారు. ఇది నొప్పిలేనటువంటిది. కనుగొనతగిన పరిష్కారాలను ఇది అందిస్తుంది మరియు మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి కంప్యూటరైజ్డ్‌ నివేదికలను సైతం అందిస్తుంది. ఈ కోవిడ్‌ కాలంలో, మేము మా రోగులకు ఉపయుక్తమైన, ప్రభావితమైన పరిష్కారాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని అన్నారు.

 
జీవించడానికి ఊపిరితిత్తుల ఆరోగ్యం అత్యంత కీలకం. నిర్ణయాలను తీసుకునేందుకు శీతాకాలం వరకూ వేచి చూడటమెందుకు. హాయిగా శ్వాసించడానికి మీ ప్రయాణం నేడే ఆరంభించండి. ఉచిత ఊపిరితిత్తుల పరీక్షతో పాటుగా మొదటిసారి హోమియోపతిక్‌ రెస్పిరేటరీ కన్సల్టేషన్‌ను సైతం ఉచితంగా పొందండి. మీ దగ్గరలోని డాక్టర్‌ బాత్రాస్‌ క్లీనిక్‌ను సంప్రదించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పు ఎక్కడ లేదూ?!