Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉప్పు ఎక్కడ లేదూ?!

ఉప్పు ఎక్కడ లేదూ?!
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:49 IST)
చాలామంది  బీపీ  కంట్రోలు  చేసుకునేందుకు  ఉప్పును తగ్గించి తింటారు.  కొందరైతే  అసలు  ఉప్పే  వాడరు. ఏ కొంచెం  తిన్నా  ఎక్కడ  బీపీ పెరుగి పోతుందేమో అన్న భయంతో  తినరు.  ఉప్పులేని  చప్పిడి తిండి  తింటారు. అయినా  కూడ బీపీ  కంట్రోలు కాదు. ఒకవైపు భయం, మరో వైపు తిండి  రుచించక  పోవడం ఎక్కడ టపా కట్టేస్తామో అనే టెన్షన్.

అసలూ మన శరీరమే ఉప్పుతో ఉంది. మనం తాగే నీటిలో ఉప్పే ఉంది.  ఉప్పు లేని పదార్థాలు ఎక్కడున్నాయి, మనం  ఉన్నదే ఉప్పులో.. మనం తినే తిండి ఎక్కడి నుండి వస్తుందంటారు? భూమి నుండే కదా! మరి భూమిలో పంట ఎలా పండుతుంది?  నీటితోనే కదా! భూమి  సముద్రంలోనే  ఉంది. 70 శాతం నీరు, 30 శాతం  భూమి ఉంది కాబట్టి ఉప్పు సముద్రంలోనే భూమి ఉంది. మొత్తం ఉప్పుతోనే  ఉంది.

పంటలు ఉప్పు నీటిలోనే  పండుతున్నాయి. కాబట్టి  ప్రతీ పదార్థంలో ఉప్పు ఉంది.  ప్రతి వస్తువూ నీటి నుండే వస్తున్నాయి.  అసలు ఈ భూమే నీటిలో ఉంది,  సముద్రంలో ఉంది. సముద్రం అంటే ఉప్పేగా. ఆ  సముద్రాలు సూర్యుని వేడికి ఆవిరై పైకి వెళ్ళి మేగాలుగా తయారై క్రిందకు  వర్షిస్తాయి. వాటిని ఫిల్టర్ చేసుకుని మనం తాగుతున్నాము. కానీ భూమి క్రింద ఉన్న నీరంతా  ఉప్పునీరే.  బోరుబావుల్లో కూడ ఉప్పు ఉంది. 

గాలిలొ ఉప్పు ఉంది. పళ్ళలో ప్రూట్స్ లో కూడా ఉప్పే ఉంది. ఉప్పు లేనిదేదీ లేదు. మనకు చెమట పట్టి నప్పుడు  అది నోటిని తాకితే ఉప్పగా ఉంటది. ఎందుకూ మనం ఉప్పు తిన్నా తినకున్నా శరీరంలో ఉప్పు ఉంది..అన్నీంటా ఉంది ఉప్పు..కాబట్టి  మనం చేయాల్సింది నీటిని బాగా మరిగించి చల్లార్చి ఫిల్టర్ చేసుకొని తాగితే కొంతలో కొంతైనా శరీరంలో ఉప్పు ఇనుము కొంచెం తగ్గుతోంది. 

బీపీ వెనక్కు తగ్గుముఖం పడుతుంది. కానీ కొంతమంది ఈ కరోనా భయంతో వేడినీళ్ళే తాగుతారు. తప్పు, వేడినీళ్లు తాగటం  వలనా లోపల సన్నటి నరాలు దెబ్బతింటాయి. మైండ్ నరాలు కూడ. కంటి నరాలు దెబ్బతింటాయి. అంతే కాదు శరీరలో మాంసం ఉడికిపోతుంది. ఫిట్టుగా ఉన్న బాడీ లూజ్ అయిపోతుంది. బలం తగ్గుతుంది. కాబట్టి వేడిని చల్లార్చి తినాలి తాగాలి. చాలామంది టీని కూడా వేడి వేడిగా తాగేస్తారు. అలా తాగకూడదు. కాస్త చల్లబడినాక తాగాలి.

మరిగించిన దానిలో ఉప్పు తగ్గుతుంది. అవిరియై బయటకు వెళ్ళిపోద్ది. కొంతమంది పచ్చి కూరలు కాయలు తింటుంటారు. కొందరు సగమే ఉడికించి తింటారు. అలా తింటే డైరెక్ట్ గా ఉప్పునే తిన్నట్టు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ఉదయాన్నే వాకింగ్  చేయాలి. ఎందుకంటే చెట్ల నుండి ఔషధాలు  విడుదల అవుతాయి. చెట్లు రాత్రి వేళ. చెడుగాలిని పీల్చుకొని ఉదయం నాలుగు గంటలనుండీ అమృతానికి సంబం ధించిన ఔషధాలను విడుదల చేస్తాయి.

అవీ ఉదయం 4 నుండి 630 వరకు ఉంటుంది. ఆ చెట్లనుండి వొచ్చే రసాయన గాలిని పీల్చుకొవాలి. కానీ మనవాళ్ళు పొద్దున్నే వ్యాపా రాలకని డుగ్ డుగ్ డుగ్ అనీ బయల్దేరుతారు. అప్పుడు పొల్యూషన్ పామై అమృత గడియల్లో విడుదలైన అఔషదాలు చెట్లరసాలగాలీ  చెడిపోతాయి.. ఇక దానికేమి చెయ్యలేము. కానీ కనీసం ఇంటిముందర అయినా వాకింగ్ చేస్తే  చెమట రూపంలో శరీరం నుండి ఉప్పు బయటకు వెళ్ళిపోతుంది.

తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే వళ్ళు తేలికగా ఉంటుంది. ఉప్పు తగ్గడం వలన మల్లీ గాలితో మన శరీరంలోకి ఉప్పు స్టోరేజ్  అవుతుంది. అందుకనీ ప్రాణాయామం చెయ్యాలి దానివలనా ఎంతో మేలు జరుగుద్ది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైట్‌ ఇలా ఉంటే రైట్