Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలి అనుభవం కోసం వేశ్యల వద్దకు తెలుగు కుర్రోళ్లు.. అమ్మాయిల సంగతేంటి?

యుక్త వయసులో ఉండే యువతీ యువకులు తొలి లైంగిక అనుభవాన్ని రుచిచూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు తొలి సెక్స్ అనుభవం కోసం వేశ్యల వద్దకు వెళుతున్నారు.

తొలి అనుభవం కోసం వేశ్యల వద్దకు తెలుగు కుర్రోళ్లు.. అమ్మాయిల సంగతేంటి?
, సోమవారం, 28 మే 2018 (16:31 IST)
యుక్త వయసులో ఉండే యువతీ యువకులు తొలి లైంగిక అనుభవాన్ని రుచిచూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు తొలి సెక్స్ అనుభవం కోసం వేశ్యల వద్దకు వెళుతున్నారు. అదే అమ్మాయిలు మాత్రం తమ బాయ్‌ఫ్రెండ్స్ ద్వారా ఈ సుఖం పొందుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్)లో తేలింది.
 
తెలంగాణలో 35 శాతం మంది, ఆంధ్రప్రదేశ్ లో 45 శాతం మంది తాము చాలా రోజుల నుంచి సెక్స్‌లో చురుకుగా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అనుకోకుండా కలిసిన అమ్మాయితో లైంగికానందం పొందామని చెప్పిన పురుషుల శాతం 20గా ఉండగా, తొలి అనుభవం కోసం వేశ్యను ఆశ్రయించామని చెప్పిన వారి శాతం 16గా ఉంది. ఇక తమ బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిశామని 68 శాతం మంది పురుషులు, 64 శాతం మంది స్త్రీలు వెల్లడించడం గమనార్హం. 
 
అంతేకాకుండా, దేశంలోని అమ్మాయిలు 19 యేళ్లకే లైంగికానుభవం పొందుతున్నట్టు తేలింది. ముఖ్యంగా, 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో వారు లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నట్టు ఈ సర్వే తేల్చింది. అయితే, దక్షిణాదితో పోలిస్తే, ఉత్తరాదిలోని వారు లైంగిక జీవితాన్ని మెరుగ్గా పొందుతున్నారని, పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని తెలిపింది. వివిధ గ్రూపుల వయసులో ఉన్న లక్ష మంది పురుషులు, మరో లక్ష మంది మహిళలను సర్వేలో పాల్గొన్నారు. 
 
ఈ సర్వేలోని వివరాల ప్రకారం, 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వారిలో 2 శాతం పురుషులు, 10 శాతం స్త్రీలకు లైంగిక అనుభవం దగ్గరవుతోంది. ఇక 15 నుంచి 19 ఏళ్ల మధ్య 23 శాతం పురుషులు, 57 శాతం మహిళలు, 20 నుంచి 24 ఏళ్ల మధ్య 42 శాతం మంది పురుషులు, 24 శాతం మంది స్త్రీలు, 24 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 23 శాతం మంది పురుషులు, 5 శాతం మంది స్త్రీలు తొలి లైంగికానందాన్ని పొందుతున్నారు. అమ్మాయిలకు యుక్త వయసులో వివాహం అవుతుండటంతోనే వారు అబ్బాయిలతో పోలిస్తే తొందరగా తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్‌హెచ్ఎస్ తెలిపింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంతిపూల నూనెను తీసుకుంటే ఏం జరుగుతుంది?