లైంగిక వేధింపుల్లో హాలీవుడ్ ప్రముఖులు.. చిక్కుల్లో హార్వీ వీన్‌స్టీన్ - మోర్గాన్ ప్రీమ్యాన్...
లైంగిక వేధింపుల్లో ఇద్దరు హాలీవుడ్ ప్రముఖులు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు హాలీవుడ్ నిర్మాత కాగా, మరొకరు హాలీవుడ్ నటుడు, నిర్మాత ఉన్నారు. ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ మహిళలపై దశాబ్దాలుగా లైంగిక
లైంగిక వేధింపుల్లో ఇద్దరు హాలీవుడ్ ప్రముఖులు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు హాలీవుడ్ నిర్మాత కాగా, మరొకరు హాలీవుడ్ నటుడు, నిర్మాత ఉన్నారు. ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ మహిళలపై దశాబ్దాలుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడని 70 మందికి పైగా మహిళలు ఇప్పటికే బాహాటంగా ఆరోపణలు గుప్పించారు.
ఇలాంటివారిలో హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు ఏంజెలినా జోలీ, సల్మా హయక్ సహా 80 మందికిపైగా ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్‌లో తొలుత వెయిన్‌స్టీన్ నిర్వాకం వెలుగుచూసింది. ఆ తర్వాత 'మీ టూ క్యాంపెయిన్' పేరిట వందలాదిగా మహిళలు సినీ, వాణిజ్య, అధికార, వినోద రంగాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.
హాలీవుడ్ నిర్మాత, సినీ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌పై కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో న్యూయార్క్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం అధికారుల ఎదుట హార్వీ లొంగిపోయారు. ఉదయాన్నే స్టేసన్‌కు వచ్చిన వెయిన్‌స్టీన్ తెల్ల షర్ట్, డార్క్ డెనిమ్ జీన్స్ ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉన్నారు. ఆయన స్పందన కోసం పాత్రికేయులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసు అధికారులు ఆయనకు ఎస్కార్ట్‌గా నిలిచారు.
శుక్రవారం ఉదయం 7:25 గంటల ప్రాంతంలో లోయర్ మాన్‌హట్టన్‌లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న నిర్మాత చిన్నగా నవ్వుతూ కనిపించాడు. పోలీసులకు లొంగిపోయిన ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. రూ.6.7 కోట్ల పూచీకత్తుతో వీన్‌స్టీన్‌కు కోర్టు బెయిలు మంజూరు చేసింది.
అలాగే, అమెరికా నటుడు, నిర్మాత, 2005లో అకాడెమీ అవార్డు విజేత, 'మిలియన్ డాలర్ బేబీ' చిత్రంలో బెస్ట్ సపోర్టింగ్ నటుడిగా ఎంపికై మోర్గాన్ ప్రీమ్యాన్‌పై కూడా ఇదేవిధంగా లైంగిక వేధింపులు వచ్చాయి. ఓ మహిళను తాకరాని చోట తాకారని, అమె లోదుస్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈయన వయసు 80 యేళ్లు.
ఈ ఆరోపణలపై మోర్గాన్ స్పందిస్తూ, నా జీవితమంతా ఇలాంటి ఆరోపణలతోనే నాశనమైందని వాపోయాడు. సురక్షితంగానీ వర్క్ ప్రదేశాన్ని తానెప్పుడూ సృష్టించలేదు. అలాగే శృంగారం కోసం ఎలాంటి ఉపాధి ఆశచూపలేదు. అలాంటి ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమన్నారు. అంతేకాకుండా తన చర్యల వల్ల ఎవరైనా ఇబ్బందులుపడివున్నట్టయితే వారందరికీ క్షమాపణ చెపుతున్నట్టు మోర్గాన్ ప్రీమ్యాన్ మీడియాతో అన్నారు.