Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Advertiesment
image

ఐవీఆర్

, శుక్రవారం, 20 జూన్ 2025 (22:46 IST)
భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (TEER) సిస్టం అయిన మైక్లిప్‌(MyClip)ను ప్రారంభించిన ప్రముఖ గ్లోబల్ మెడ్-టెక్ కంపెనీ మెరిల్ లైఫ్ సైన్సెస్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. జూన్ 13 నుంచి 15 వరకు గుజరాత్‌లోని వాపిలో మెరిల్ అకాడమీలో జరిగిన ఈ ల్యాండ్‌మార్క్ స్ట్రక్చరల్ హార్ట్ ఇన్నోవేషన్ ఈవెంట్‌లో, ప్రొఫెసర్ ఒట్టావియో అల్ఫియరీ ("మిట్రల్ వాల్వ్ రిపేర్ ఫాదర్"), ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో మైసానో మరియు ప్రొఫెసర్ అగ్రికోలా మొదలగు వారితో కలిపి 150 మందికి పైగా భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులతో పాటు కార్డియాక్ ఇమేజింగ్‌లో నిపుణులైన అంతర్జాతీయ దిగ్గజాలను ఒకచోట చేర్చి, ఎడ్జ్-టు-ఎడ్జ్ మిట్రల్ వాల్వ్ రిపేర్‌ విషయంలో ప్రపంచంలోని మార్గదర్శకులతో కలిసింది.
 
మైవాల్ THVతో అందుకున్న విజయం తరువాత, ప్రస్తుతం మెరిల్ ఈ ప్రపంచంలోనే అగ్రగామి అయిన TAVI గ్రూప్, TEER సిస్టంను ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ కంపెనీ, ట్రాన్స్‌కాథెటర్ హార్ట్ వాల్వ్ థెరపీలతో (రీప్లేస్‌మెంట్-రిపేర్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లతో) దేశాన్ని మ్యాప్‌లో ఒక ఆవిష్కర్తగా చేసింది. మైక్లిప్ (MyClip) చేసిన ఈ పరిచయ ప్రదర్శన స్ట్రక్చరల్ హార్ట్ సొల్యూషన్స్‌లో భారతదేశంలో పెరిగే సామర్థ్యాలతో అత్యాధునిక కార్డియాక్ సంరక్షణను అందించడానికి మెరిల్ చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుంది.
 
భరించలేని మిట్రల్ రెగర్జిటేషన్(MR)తో బాధపడుతున్న రోగుల కోసం మైక్లిప్(MyClip) టీర్ సిస్టం రూపొందించబడింది, ఈ రోగులలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, వృద్ధాప్యం, శారీరక బలహీనత, విస్తరించిన లేదా బలహీనమైన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారికి, శస్త్రచికిత్సలో ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా MRకు, వెంటనే చికిత్స జరగట్లయితే, ప్రాణహాని కలిగే పరిస్థితులు సంభవించవచ్చు. సరైన సమయంలో చికిత్స అందనట్లయితే 50% కంటే ఎక్కువ మంది రోగులు జీవించి ఉండే అవకాశం ఉండదు. ఇలా జరిగే మరణాలు 1-సంవత్సరంలో 57% వరకు ఉండవచ్చు.
 
మైక్లిప్ (MyClip) టీర్ సిస్టం, మిట్రల్ వాల్వ్ ఫ్లాప్‌లను ఖచ్చితంగా మూసివేయడానికి మంచి అవకాశం కలిగిస్తుంది, శుద్ధి చేయబడిన రక్తం ఊపిరితిత్తులలోకి తిరిగి రావడాన్ని ప్రతిభావంతంగా ఆపుతుంది. ఈ పద్దతి కనీస ఇన్వాసివ్‌గా ఉంటుంది, ఇక ఈ ప్రక్రియకు దాదాపు ఒక గంట పడుతుంది. రోగులు 3 నుంచి 5 రోజులలో వారి ఇంటికి తిరిగి వెళ్ళడానికి చక్కని అవకాశం ఉంటుంది. డిశ్చార్జ్ అయిన తరువాత, కొద్ది రోజులలోనే, రొగులు వారు ప్రతిరోజూ అలవాటైన వాకింగ్, ఎక్కువ శ్రమలేని పనులను తిరిగి ప్రారంభించవచ్చు.
 
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్(NEJM)లో పబ్లిష్ అయిన ల్యాండ్‌మార్క్ COAPT అధ్యయనం ప్రకారం, మిట్రల్ రెగర్జిటేషన్ కోసం డివైస్ ఆధారిత చికిత్సలో ఉన్న రోగులు స్టాండర్డ్ మెడికల్ చికిత్స పొందుతున్న వారితో పోలిస్తే ఎంతో మంచి ఫలితాలను పొందారు. 24 నెలలలోపు, గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య, కంట్రోల్ గ్రూప్‌లో ఉండే 67.9%తో పోలిస్తే, సంవత్సరానికి 35.8%కి తగ్గింది. అంతేకాకుండా, అదే సమయంలో కంట్రోల్ గ్రూప్ లో 46.1%గా ఉన్న మరణాలు డివైస్ గ్రూప్ లో బాగా తక్కువగా అనగా 29.1%గా ఉన్నాయి.
 
ప్రస్తుతం, భారతదేశంలో ఏటా సుమారు 150 TEER (ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్) విధానాలు జరుగుతున్నాయి, రోగులలో ఎక్కువ మంది చిన్న వయసువారే (30 - 60) ఉన్నారు. ఈ గణాంకాలు యువ జనాభాకు చిన్న వయసు నుండే కావలసిన అత్యవసర అవసరాలని వెలుగులోకి తెస్తున్నాయి. మైక్లిప్ (MyClip) టీర్ సిస్టం ప్రారంభం అనేది భారతదేశంలో స్ట్రక్చరల్ హార్ట్ థెరపీకి ఒక పరివర్తనాత్మక క్షణాన్ని తెలియజేస్తుంది. ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (TEER) థెరపీ సాంప్రదాయ గైడ్‌లైన్ డైరెక్ట్ మెడికల్ థెరపీ (GDMT) కంటే కూడా గొప్ప విజయాన్ని అందించింది. మైక్లిప్ (MyClip) భారతదేశంలో కార్డియోవాస్క్యులర్ చికిత్స రంగంలో ముఖ్యమైన ఒక ముందడుగుకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?