Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 4 మార్చి 2025 (22:03 IST)
హైదరాబాద్: రక్త క్యాన్సర్, రక్త రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన DKMS ఫౌండేషన్ ఇండియా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT హైదరాబాద్)తో కలిసి రక్త మూల కణ అవగాహన, దాన కార్యక్రమాన్నిIIT హైదరాబాద్ కళాశాల ఉత్సవం ఎలాన్& ఎన్విజన్ 2025 సందర్భంగా విజయవంతంగా నిర్వహించింది. 16వ వార్షిక సాంకేతిక-సాంస్కృతిక ఉత్సవంలో DKMS ఫౌండేషన్ ఇండియా సామాజిక సంక్షేమ భాగస్వామిగా ఉంది. రక్త క్యాన్సర్‌లు, ఇతర ప్రాణాంతక రక్త సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడానికి భారతదేశంలో బలమైన రక్త మూల కణ దాత రిజిస్ట్రీని కలిగి ఉండవలసిన అవసరం గురించి యువతకు అవగాహన కల్పించడానికి DKMS ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది.
 
ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా విద్యార్థులు సంభావ్య రక్త మూల కణ దాతలుగా నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత గురించి ఎలాన్ & ఎన్విజన్ 2025 యొక్క ఓవరాల్ కోఆర్డినేటర్ మెహుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “DKMS ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ద్వారా మేము అవగాహన పెంచడమే కాకుండా, మార్పు తీసుకురావడానికి విద్యార్థులను ప్రేరేపించ గలిగాము. సంభావ్య రక్త మూల కణ దాతగా నమోదు చేసుకోవడం వల్ల ఒక రోజు ఒక ప్రాణాన్ని కాపాడగలమనే వాస్తవం విద్యార్థులు గుర్తించారు” అని అన్నారు. 
 
ఈ కార్యక్రమం అంతటా పాల్గొనేవారికి రక్త మూల కణ దాన ప్రక్రియ, అర్హత ప్రమాణాలు తదితర అంశాల పట్ల అవగాహన కల్పించారు. DKMS ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ పాట్రిక్ పాల్, విద్యార్థుల భాగస్వామ్యం, సామాజిక కారణాల పట్ల తమ సంతోషం వ్యక్తం చేస్తూ "విద్యా సంస్థలతో మా అనుబంధం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రతిభ, ఆవిష్కరణలను వేడుక జరుపుకునే కార్యక్రమాలలో సామాజిక బాధ్యతను చేర్చడం ద్వారా ఒక నమూనాగా నిలుస్తుంది. విద్యార్థుల ప్రతిస్పందన , సానుకూల దృక్పథం పట్ల సంతోషిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?