Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CORBEVAX ధరను రూ.250కి తగ్గించిన బయోలాజికల్-ఈ

Advertiesment
Vaccine
, సోమవారం, 16 మే 2022 (15:42 IST)
Vaccine
హైదరాబాద్‌‌కు చెందిన వ్యాక్సిన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ.. బయోలాజికల్ ఈ-లిమిటెడ్ (బీఈ) తన కోవిడ్-19 వ్యాక్సిన్ కార్బెవాక్స్ ధరను తగ్గించింది. ఈ వ్యాక్సిన్ ధర జీఎస్టీతో కలిసి రూ.840లు. ఈ ధరను ప్రస్తుతం రూ.250కి తగ్గించినట్లు బీఈ ప్రకటించింది.  
 
బీఈ తన వ్యాక్సిన్ ధరను మరింత చౌక చేసింది. కరోనా నుంచి పిల్లలను కాపాడేందుకు ఒక డోసు ధరను రూ.250లకు తగ్గించింది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కొరకు బయోలాజికల్ E. లిమిటెడ్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) అందుకున్న కొన్ని వారాల్లోనే బీఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సి ప్రైవేట్ మార్కెట్ ధర అన్నీ ఛార్జీలతో సహా మోతాదుకు రూ .990.
 
కార్బెవాక్స్ సింగిల్-డోస్ ప్రస్తుతం రూ.250లకే అందించబడుతుంది. ఇది వ్యాక్సిన్ ఇవ్వడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ సీసా వ్యాక్సిన్ వృధాను తొలగిస్తుంది, ఇది ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రయోజనకరంగా వుంటుంది. 
 
12 నుంచి 17 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం కో-విన్ యాప్ లేదా కో-విన్ పోర్టల్ ద్వారా కార్బెవాక్స్ వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు 43.9 మిలియన్ మోతాదుల కార్బెవాక్స్ ఇవ్వబడింది. అలాగే బయోలాజికల్ ఇ. లిమిటెడ్ భారత ప్రభుత్వానికి దాదాపు 100 మిలియన్ మోతాదులను సరఫరా చేసింది.
 
బయోలాజికల్ ఇ. లిమిటెడ్, టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్- బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో కార్బెవాక్స్ అభివృద్ధి చేసింది. వ్యాక్సినేషన్ కోసం ఇయుఎను పొందడానికి ముందు, కంపెనీ 5-12,  12-18 సంవత్సరాల వయస్సు గల 624 మంది పిల్లలపై ఫేజ్ 2, 3 మల్టీసెంటర్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి 6 గంటల తర్వాత ఏం చేయాలి?