ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా..!
మనస్సంటే ఓ ఆలోచనల మూట. నిరంతరం మన మనస్సులో ఏవో ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఆలోచనలు మీవి కావు; అవి మీ మీద పడిన సామాజిక ప్రభావాల వల్ల మీలో చేరాయి. అవ
మనస్సంటే ఓ ఆలోచనల మూట. నిరంతరం మన మనస్సులో ఏవో ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఆలోచనలు మీవి కావు; అవి మీ మీద పడిన సామాజిక ప్రభావాల వల్ల మీలో చేరాయి. అవి ఇతరులు ఇచ్చే సలహాల వంటివి, వాటిని మీరు స్వీకరించాలనుకున్నా, పట్టించుకోవద్దనుకున్నా, ఆ నిర్ణయం మటుకు మీదే, అవునా, కాదా?
ఆలోచన ఎప్పుడూ ఏమీ చేయదు, అది వస్తూ పోతూ ఉంటుంది. మీరు ఏ ఆలోచనను చుకోవాలనుకుంటున్నారు? ఏ ఆలోచనను ఎంచుకోవాలనే నిర్ణయాన్ని మీ చేతుల్లో ఉంచుకోవడం చాలా అవసరం. మీకు ఏ ఆలోచన అవసరమో దాన్నే మీరు ఎంచుకోవాలి. కాని, మీరు ఇప్పుడు అలా ఎంపిక చేసుకోవడం లేదు, మీరు మీకు వచ్చిన ఆలోచనలన్నిటినీ ఎంచుకుంటున్నారు. అందువల్లనే మీ మనస్సంతా గందరగోళంగా ఉంటుందట.