Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవం కలిగిన ఆహారం గోధుమ నారు 'గోధుమగడ్డి రసం' (video)

Advertiesment
జీవం కలిగిన ఆహారం గోధుమ నారు 'గోధుమగడ్డి రసం' (video)
, సోమవారం, 19 జులై 2021 (10:33 IST)
గోధుమ గడ్డిని 'జీవం కలిగిన ఆహారంగా ' పేర్కొనవచ్చును. ఇది విటమిన్ "ఇ 'తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్లోరోఫిల్‌ని అందిస్తుంది.

రక్త శుద్దికి, శరీర కణాల పునర్జన్మకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది. మెరుగుపరుస్తుంది. కాన్సర్ వ్యాధి పెరుగుదలను నివారిస్తుంది. గోధుమ గడ్డి రసం త్రాగడం వలన శరీరములోని విషపూరితాలన్నీ బయటికు విసర్జింపబడతాయి. 
 
గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి, ఇ, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక్, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒక గ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది.

దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తించారు. గోధుమ గడ్డి ప్రయోజనాలను దిగు వన ఉదహరిస్తున్నాము. 
 
1. ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణా లు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి.
 
2. అధిక రక్తపోటు నివారిణి: గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది. 
 
3. తల్‌సేమియా రోగులకు మంచిది: ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో 'తల్‌ సేమియా' రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాటిమాటికి చేతులు, కాళ్లు తిమ్మిరి పడుతున్నాయా?... తస్మాత్ జాగ్రత్త