Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

Advertiesment
Almonds

సిహెచ్

, గురువారం, 15 మే 2025 (16:29 IST)
ఇరు భోజనాల మధ్య సమయంలో కలిగే ఆకలి, తమ బరువు పట్ల అమిత జాగ్రత్త పడేవారికి ఒక గమ్మత్తైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇది తరచుగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుంది. అనారోగ్యకరమైన ఎంపికల వైపు మనల్ని దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. చివరికి మన ఆహార లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కానీ స్నాక్స్ సరిగా తింటే అది సమస్య కాదు. అది బరువు తగ్గడానికి అవసరమైన మద్దతు కూడా ఇస్తుంది. డాక్టర్ రోహిణి పాటిల్- ఎంబిబిఎస్, పోషకాహార నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, బాదం, పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం.
 
ఈ స్మార్ట్ స్నాక్స్ ఎంపికలు కోరికలను అరికట్టడమే కాకుండా మిమ్మల్ని శక్తివంతం చేయటంతో పాటుగా సంతృప్తికరంగా ఉంచేలా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. నిజమైన సమస్య స్నాక్స్ తినడం కాదు, మనం ఏమి తింటున్నాము మరియు ఎంత తీసుకుంటున్నాము అనేదే అని డాక్టర్ పాటిల్ నొక్కి చెప్పారు. సరైన పోషకాలను సమపాళ్లలో ఎంచుకోవటంతో పాటుగా  వ్యూహాత్మకంగా స్నాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా, ఆహారాన్ని ఆస్వాదిస్తూనే ఆరోగ్య లక్ష్యాలతో ట్రాక్‌లో ఉండటం సాధ్యమవుతుంది. మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచడానికి, మీ బరువు తగ్గించే ప్రయాణంతో మీరు సమలేఖనం కావడానికి ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంపికలు ఉన్నాయి.
 
1. గుప్పెడు బాదం
బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వాటి కరకరలాడే ఆకృతి, సహజంగా సంతృప్తికరమైన రుచి ఆకలిని అరికట్టడానికి వాటిని ఒక స్నాక్‌గా చేస్తాయి. బాదం గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, తృప్తికి కూడా మద్దతు ఇస్తుంది, బరువు నిర్వహణకు అనువైనదిగా చేస్తుంది.
 
డాక్టర్ పాటిల్ ముఖ్యంగా కాలిఫోర్నియా బాదంలను సిఫార్సు చేస్తారు, ఇవి సహజ ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్‌తో నిండి ఉంటాయి, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అవి వైవిధ్యంగా కూడా ఉంటాయి. వాటిని నేరుగా ఆస్వాదించవచ్చు, స్మూతీలలో కలపవచ్చు, సలాడ్‌లలో వేయవచ్చు లేదా చిటికెడు మసాలాతో కాల్చవచ్చు.
 
2. మూంగ్ దాల్ చిల్లా
నూనె లేకుండా నాన్-స్టిక్ పాన్‌లో వండిన మూంగ్ దాల్ చిల్లా బరువు తగ్గడానికి అనుకూలమైన మరొక చిరుతిండి. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్‌ సమృద్ధిగా కలిగి ఉంటుంది, ఇది ఆకలిని నియంత్రించడానికి , శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. దాని పోషక విలువను పెంచడానికి పాలకూర, ఉల్లిపాయలు, టమోటాలు వంటి సన్నగా తరిగిన కూరగాయలను జోడించమని డాక్టర్ పాటిల్ సూచిస్తున్నారు. మూంగ్ దాల్‌ ( పెసర పప్పు) లో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము మరియు రాగి పుష్కలంగా ఉంటాయి, జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యం రెండింటికీ మద్దతు ఇస్తుంది.
 
3. మొలకలు భేల్
పెసర మరియు శనగల మొలకలతో తయారు చేయబడిన ఈ రుచికరమైన, కరకరలాడే స్నాక్ కడుపు నింపుకోవడానికి తోడ్పడటమే కాకుండా చాలా పోషకమైనది కూడా. దోసకాయ, టమోటాలు, పచ్చి మామిడి, నిమ్మరసంతో కలిపిన మొలకలు భేల్ ఫైబర్, విటమిన్లు ఎ, సి మరియు కె, కాల్షియం మరియు ఇనుము వంటి ఖనిజాలను సమృద్ధిగా అందిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ సూచికతో, ఇది రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది - తమ బరువును పర్యవేక్షించే ఎవరికైనా ఇది సరైనది.
 
4. దోసకాయ సలాడ్‌తో పనీర్ క్యూబ్స్
ప్రోటీన్-రిచ్ స్నాక్స్ కోరుకునే శాఖాహారులకు, పనీర్ ఒక గొప్ప ఎంపిక. ఇది కండరాల నిర్వహణ, ఎముక ఆరోగ్యం, సంతృప్తికి మద్దతు ఇస్తుంది. సాదా పనీర్ క్యూబ్‌లను ముక్కలు చేసిన దోసకాయతో జత చేసి, నిమ్మరసం, తేలికపాటి సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు జోడించడం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటుగా తక్కువ కేలరీలు కలిగి హైడ్రేటింగ్, పోషకాలను అందిస్తుంది అని డాక్టర్ పాటిల్  సూచించారు. 
 
5. వేయించిన శనగలు 
వేయించిన సెనగలు కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే సౌకర్యవంతమైన, అధిక-ప్రోటీన్, అధిక-ఫైబర్ స్నాక్. ఇది ఇనుము, భాస్వరం, మెగ్నీషియం మరియు విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఈ క్రంచీ చిక్కుడు రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన స్నాక్స్ కోరుకునే వారికి అద్భుతమైన జోడింపుగా నిలుస్తుంది.
- డాక్టర్ రోహిణి పాటిల్, ఎంబిబిఎస్ మరియు పోషకాహార నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్