మునగాకులో ఆరోగ్య పోషకాలు ఎన్నో వున్నాయి. ఇనుము, పొటాషియం, సోడియం, కాల్షియం, కాపర్, జింక్, మెగ్నీషియం, మాంగనీసు, విటమిన్ ఏబీసీ, బీటా కరోటీన్, బీ కాంప్లెక్స్, టైటాజీ బైపర్, కార్పోహైడ్రేట్స్, ప్రొటీన్లు వున్నాయి. మునగాకును కూరల్లో కాకుండా సూప్ తరహాలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మునగాకు సూప్ తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వున్నాయి. శరీరంలోని కొవ్వు కొవ్వు స్థాయిని తగ్గించడం. గొంతు నొప్పి వంటి రుగ్మతలు తొలగిపోతాయి. ఆస్తమా దరి చేరదు. రక్తహీనత తొలగిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు మునగాకు ఎంతగానో మేలు చేస్తుంది. మునగాకులో రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.