టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు చక్కెరను నివారించాలని అందరికీ తెలుసు. అయితే కొత్త పరిశోధనలో ఉప్పును తగ్గించాలని తేలింది. ఆహారంలో ఉప్పును తరచుగా చేర్చడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యుఎస్‌లోని టులేన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన అధ్యయనంలో తేలింది.
'మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్' జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... ఉప్పు తీసుకోవడం గురించి 400,000 కంటే ఎక్కువ మంది పెద్దలను సర్వే చేసింది. ఉప్పు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్ 2 ముప్పు వుందని తేలింది.
ఉప్పును పరిమితం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని.. అలాగే ఈ అధ్యయనం మొదటిసారిగా ఉప్పు షేకర్‌ను టేబుల్‌పై నుండి తీసేస్తే టైప్-2 డయాబెటిస్‌ను కూడా నివారించడంలో సహాయపడుతుందని చూపిస్తుంది.. అని ప్రొఫెసర్ డాక్టర్ లు క్వి చెప్పారు. ఊబకాయం, వాపు వంటి ప్రమాద కారకాలను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుందని క్వి అభిప్రాయపడ్డారు.