మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలును ఇస్తుంది. ఇక ఉప్పు ఆరోగ్యానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాంటి మునగాకు ప్లస్ రాళ్ల ఉప్పుతో సాల్ట్‌ను ఎలా చేయాలో చూద్దాం.. మునగాకు సాల్ట్ ఉప్పును వాడటం ద్వారా ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలను అందజేస్తుంది.
శరీర శక్తిని ఉత్తేజపరిచే సహజమైన పోషకాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు, విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్‌లతో సహా 90కి పైగా పోషకాలతో కూడిన ఈ ఆరోగ్యకరమైన మునగాకు సాల్టును రోజూ మితంగా ఆహారంలో వాడుకోవడం మంచిది. ఇంకా సంపూర్ణ రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఉప్పులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, రాగి, ఇనుముతో సహా ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
మునగాకులో ఇనుము, విటమిన్ ఎ, ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి. అరటిపండ్ల కంటే మునగాకులో ఏడు రెట్లు ఎక్కువ పొటాషియం, పాలలో ఉన్న ప్రొటీన్ కంటే రెండింతలు ఎక్కువ క్యాల్షియం ఇందులో వుంటుంది. తద్వారా మునగాకులో కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు, విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ ఉప్పును వంటకాల్లో వాడటం ద్వారా సరైన శరీర బరువును కలిగివుంటారు. ఒబిసిటీ దరిచేరదు. మెదడు పనితీరు మెరుగవుతుంది.
ఈ మునగాకు సాల్ట్‌ను కూరలు, వేపుడుల్లో, సూప్‌లలో వాడవచ్చు. అతిగా ఉడకబెట్టడం వల్ల పోషకాలను కోల్పోయే అవకాశం ఉన్నందున ఈ ఉప్పును వండిన తర్వాత ఆహారంలో చివరలో ఉపయోగించడం మంచిది. ఏడాది చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారికి ఇది సురక్షితమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
మునగాకు సాల్ట్‌కు కావలసిన పదార్థాలు
రాళ్ల ఉప్పు- గుప్పెడు
మునగాకు - గుప్పెడు
తయారీ విధానం..
ముందుగా శుభ్రం చేసుకున్న మునగాకును వేడైన బాణలిలో వేసి వేపాలి. అందులో రాళ్లను ఉప్పును కూడా చేర్చాలి. ఈ రెండింటిని బాగా వేపుకోవాలి. మునగాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి. ఉప్పు వేడి తగ్గిన తర్వాత వేపిన మునగాకు, ఉప్పును మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉప్పును బౌల్‌లోకి తీసుకుని కాసేపు అయ్యాక సీసాలలో భద్రపరుచుకోవచ్చు. ఈ మునగాకు ఉప్పును తయారీ చేసేటప్పుడు ఉప్పును, మునగాకు సరిసమానంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.