Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాస్ట్రోల్ కొత్త ప్రచారం: ట్రక్కర్ కమ్యూనిటీకి వ్యాపారం, ఫైనాన్స్, ఆరోగ్యం, సాంకేతికత పాత్ర ప్రాముఖ్యత

Advertiesment
image
, బుధవారం, 19 జులై 2023 (22:30 IST)
భారతదేశంలోని ప్రముఖ లూబ్రికెంట్ సంస్థ అయిన క్యాస్ట్రోల్‌ తాజాగా క్యాస్ట్రాల్ సీఆర్బీ టర్బో మ్యాక్స్‌ని ఇష్టపడే ట్రక్కర్‌ల అద్భుతమైన పురోగతి, విజయావకాశాలపై దృష్టి సారిస్తూ, #BadhteRahoAage అనే కొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఒగొవి కలసి రూపొందించిన ఈ క్యాంపెయిన్, ట్రక్కర్ల పురోగతి, విజయానికి దాని నిబద్ధతను బలోపేతం చేయడంలో క్యాస్ట్రోల్‌ కు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
 
వాణిజ్య వాహనాలు, ట్రక్ డ్రైవర్లు భారతీయ రవాణా, లాజిస్టిక్స్ పరిశ్రమకు వెన్నెముకగా పనిచేస్తున్నారు. ట్రక్ డ్రైవర్లు హైవేలను అలసిపోకుండా ప్రయాణాలు చేస్తారు. వివిధ రంగాలకు శక్తినిచ్చే అవసరమైన ఉత్ప త్తులను అందచేస్తారు. తద్వారా వ్యాపారాలు, పరిశ్రమలు, సంఘాలను కలుపుతారు. క్యాస్ట్రోల్ #Badhte RahoAage ప్రచారం ట్రక్కర్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. వారికి ఉన్నతమైన ఇంజిన్ రక్షణతో సాధికా రత కల్పించడం, వారు పురోగమించేలా, ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ ప్రచార కార్యక్రమం గురించి క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ జయ జమ్రానీ మా ట్లాడుతూ, "మా కొత్త ప్రచారం #BadhteRahoAage వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చేయడంలో ట్రక్కర్లకు అచంచలమైన మద్దతునిస్తుంది. ఇది జీవితానికి అందే పురోగమనాన్ని వేగవంతం చేయాలనే ఆశయసాధనకు క్యాస్ట్రోల్ యొక్క అనేక మార్గాలలో ఒకటి. ఈ అసాధారణ సమాజంతో మన బంధాన్ని పటిష్టం చేసుకోవడమే మా లక్ష్యం, ప్రగతి సాధనలో వారి నమ్మకమైన మిత్రులుగా మా అచంచ లమైన నిబద్ధతను పునరుద్ఘాటించడం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో జనసేనాని భేటీ.. ట్వీట్ వైరల్