రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం తీసుకోవాలి. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్ వాడాలి. ఇందులో ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా వుంటాయి. అలాగే మట్టి పాత్రలు లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించుకుని తీసుకోవడం మంచిది. మట్టిపాత్రల్లో అన్నం ఉడికించడం ద్వారా మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి.
అయితే వంటకు అల్యూమినియం పాత్రలు వాడకపోవడం మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తీసుకుంటే అతి చిన్న వయస్సులో కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెప్తున్నారు.
ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దు.
నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు దారితీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.