పైనాపిల్ జ్యూస్ చాలామంది తాగుతుంటారు. పైనాపిల్ బరువు తగ్గడానికి భలేగా ఉపయోగపడుతుంది. ఈ పైనాపిల్ ప్రయోజనాలు ఏమిటో, నష్టాలు ఏమిటో తెలుసుకుందాము.
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఆకలిని అణిచివేసి ప్రేగు కదలికలను సున్నితంగా చేయడంతో సులభంగా బరువు తగ్గుతారు.
	 
	దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్నవారు పైనాపిల్ జ్యూస్ తాగితే సమస్య నుంచి బయటపడవచ్చు.
	 
	పైనాపిల్ రసం తాగేవారు కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందగలుగుతారు.
	 
	పైనాపిల్ ప్రయోజనాలు ఇలా వుంటే దీనివల్ల నష్టాలు కూడా వున్నాయి.
	 
	పైనాపిల్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది.
	 
	పైనాపిల్‌లో వుండే అధిక ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది.
	 
	పైనాపిల్‌కు అలెర్జీ ఉన్న వ్యక్తులకు నోరు, బుగ్గల వాపు వస్తుంది.
	 
	బద్ధకం, బలహీనత, తలనొప్పి, వికారం మొదలైనవి కనబడతాయి.