Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

తులసి.. డయాబెటిస్‌ను దూరం చేస్తుందట..

తులసిలో ఔషధ గుణాలెన్నో వున్నాయి. . ఈ తులసికి దగ్గు, చర్మవ్యాధులు, ప్రేవులకు సంబంధించిన రుగ్మతలను బాగా నయం చేసే శక్తి ఉన్నది.

Advertiesment
Tulasi
, గురువారం, 11 అక్టోబరు 2018 (10:42 IST)
తులసిలో ఔషధ గుణాలెన్నో వున్నాయి. . ఈ తులసికి దగ్గు, చర్మవ్యాధులు, ప్రేవులకు సంబంధించిన రుగ్మతలను బాగా నయం చేసే శక్తి ఉన్నది. అజీర్ణం, తలనొప్పికి విరుగుడుగా తులసి ఆకులు వేసి టీ పనిచేస్తుంది. అంతేకాదు స్త్రీలలో రొమ్ము కేన్సరును నివారించగలదు. కణితులను తగ్గించడంలో, వాటిలో రక్తసరఫరా తగ్గించడంలో, అవి విస్తరించకుండా నిరోధించడంలో తులసి కీలక పాత్ర వహిస్తుంది. తులసి తైలనాన్ని శరీరానికి మంచి వర్చస్సు, తేజస్సును ఇస్తుంది. 
 
తులసి ఆకులను ఎండబెట్టి, వాటిని పొడిచేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా       వాడుకుంటే దంతక్షయంతో పాటు నోటిదుర్వాసన పోయి, పళ్ళను అందంగా మార్చ గలిగే గుణం కలదు. తులసి ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. 
 
తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉండటంతో డయాబెటిస్ వారికి చక్కగా పనికొస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికీ తులసి చక్కగా పనికొస్తుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆరసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది. తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్మ సౌందర్యానికి మేలు చేసే బీట్రూట్ జ్యూస్