Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రిపూట కంటినిండా నిద్రపోవాలంటే...

రాత్రిపూట కంటినిండా నిద్రపోవాలంటే...
, బుధవారం, 10 అక్టోబరు 2018 (11:02 IST)
చాలా మందికి రాత్రిపూట అస్సలు నిద్రపట్టదు. దీంతో వారు లేచి అటూఇటూ తిరుగుతుంటారు. దీనికి కారణం మానసిక ఒత్తిడి. అయితే, కంటికి నిద్ర కరువైతే అనారోగ్య సమస్యలూ తలెత్తే ఆస్కారం ఉంది. ముఖ్యంగా, నిద్ర కరువైన వారిలో మధుమేహం, అధిక బరువు, మానసికి ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్టు ఏథెన్స్‌లోని ఒనాస్సిస్ కార్డియాక్ సర్జరీ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకే రాత్రి కంటినిండా నిద్ర పోవాలంటే...
 
తక్కువ మోతాదులో ఆహారం : రాత్రి పూట తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. 'ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది నిద్రకు దూరం చేస్తుంది'. అందువల్ల వీలైనంత మేరకు మితంగానే ఆహారం తీసుకోవాలి. అదేసమయంలో రాత్రి భోజనంలో కూరగాయలు ఎక్కువగా, కార్భోహైడ్రేట్లు, ప్రోటీన్లు, చేపలు, చికెన్‌ తక్కువగా తీసుకోవాలి.
 
నిద్రకు ముందు కాఫీ వద్దనే వద్దు : చాలా మంది రాత్రి పడుకునే ముందు టీ, కాఫీలు తాగడం అలవాటు ఉంటుంది. ఇలా కాఫీ తాగితే అందులోని కెఫిన్‌ ప్రభావం 10 గంటల వరకూ ఉంటుంది. ఫలితంగా రాత్రిళ్లు తొందరగా నిద్రపట్టదు. వారు మధ్యాహ్నం తర్వాత కాఫీ తాగకపోవడమే మంచిది. ఎనర్జీ డ్రింక్స్‌ కూడా ముట్టుకోరాదు.
 
డ్రైఫ్రూట్స్ - నట్స్ తీసుకోవాలి: రాత్రి భోజనం చేశాక, నిద్రపోయే ముందు ఆకలిగా అనిపిస్తే నట్స్‌ తినాలి. వీటిలోని పొటాషియం, సెలీనియం తొందరగా నిద్రపట్టేలా చేస్తాయి.. నిద్రపోయే ముందు ఛీజ్‌, బటర్‌, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమమని నిపుణులు సూచన చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమలపాకులను నుదుటిపై పెట్టుకుంటే..?